బాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఫిట్‌నెస్, గ్లామర్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఒక ప్రముఖ కథానాయిక తన అందం వెనుక ఉన్న రహస్యంపై వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండించింది. తాను ఎలాంటి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోలేదని చాలా స్పష్టంగా చెప్పింది. ఒక టాక్ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ, తన వయసు మరియు శారీరక మార్పులపై వస్తున్న రూమర్లకు ఒకేసారి చెక్ పెట్టింది.