GHMC అధికారులు హైకోర్టు ఆదేశాలతో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. పాదచారులకు, ట్రాఫిక్‌కు ఆటంకంగా మారిన ఆక్రమణలను తొలగించారు. బడంగ్‌పేట సర్కిల్‌లో అత్యధికంగా 333 దుకాణాలు సహా మొత్తం 653 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ నిరంతర డ్రైవ్‌తో ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గి, ప్రజల భద్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు.