Dehydration in Young Children: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వేడి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది, దీని ప్రభావం ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యంపై ఎక్కువగా కనిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్ల పిల్లలు చెమట ద్వారా శరీరంలో నీటిని త్వరగా కోల్పోతున్నారు, ఫలితంగా డీహైడ్రేషన్ సమస్యలు ఎదురవుతున్నాయి. వాంతులు, విరేచనాలు, తగినంత నీరు తాగకపోవడం, అలాగే ఎక్కువసేపు ఎండలో ఉండటం కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.