ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ నాసిక్ క్యాంపస్ లో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే ఈ వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఓ మహిళా ఉద్యోగి తన ఫిర్యాదులో పలు సంచలన విషయాలు వెల్లడించారు. గతేడాది వివాహం కాగానే జాబ్ లో జాయిన్ అయ్యానని, క్యాంపస్ లో ఓ వ్యక్తి తన చీరలాగి, చేయి పట్టుకుని దగ్గరకు లాగి ఒళ్లంత తడిమాడని.. తొడలు, బుజాలపై చేతులు వేశాడని బాధిత మహిళ వాపోయింది. ఉద్యోగం పోతుందని యజమాన్యానికి ఫిర్యాదు చేయలేదని చెప్పింది.
అయితే ఇప్పటికే ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు ఈ వ్యవహారం పై ఫిర్యాదులు చేశారు. ఫిబ్రవరి 2022 నుంచి మార్చి 2026 వరకు జరిగిన మానసిక, లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం SIT ఏర్పాటు చేశారు.
సంచలన రేకెత్తించిన ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేయటం గమనార్హం.















