ఉరుకుల పరుగుల జీవితంలో పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల మన ఆరోగ్యం నిశ్శబ్దంగా క్షీణిస్తోంది. మన పూర్వీకులు అనుసరించిన సంప్రదాయ ఆహారపు అలవాట్లు మనల్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతాయి. ముఖ్యంగా మొలకెత్తిన గింజలు విత్తనాలలో ఉండే అద్భుతమైన పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా, రక్తపోటు, మధుమేహం గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.