పరుచూరి గోపాలకృష్ణ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై తన విశ్లేషణతో నెట్టింట వైరల్ అవుతున్నారు. స్క్రీన్‌ప్లే లోపాలు, హీరో ఎంట్రీ ఆలస్యం, కథ, టైటిల్‌కు మధ్య సమతుల్యత లోపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. యాక్షన్, ప్రేమకథల సమతుల్యతను సరిచేసి ఉంటే పవన్ కల్యాణ్ సినిమా ఇంకా బాగా ఆడేదని 'పరుచూరి పాఠాలు' ద్వారా వివరించారు.