భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం జూన్ 18 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండొచ్చని అధికారులు తెలిపారు.
కొత్తగా ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థ కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఈ సమయంలో పిడుగులు, మెరుపులు, ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది.
ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు.











