🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
📚 జ్ఞాన వేదిక›సూక్తులు
💎

తెలుగు సూక్తులు

తెలుగు సాంప్రదాయ సూక్తులు — జీవిత పాఠాలు, ఆధ్యాత్మిక సూచనలు, వ్యక్తిత్వ వికాసం కోసం.

మొత్తం 400 సూక్తులు · సామెతలు → · పొడుపు కథలు →

నిజమైన స్నేహితున్ని సంపాదించుకోవడం అన్నిటికంటే కష్టతరం.

వివరం →

మనసులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆచరణ ఈ మూడు ఒకటిగా ఉన్నవాడే మహాత్ముడు.

వివరం →

ఓటమి గురువులాంటిది. ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది.

వివరం →

మీరు ప్రతిరోజూ తృప్తిగా నిద్రించాలనుకుంటే, ప్రతి ఉదయమూ ఒక చక్కటి సంకల్పంతో నిద్ర లేవడం అలవాటు చేసుకోండి.

వివరం →

పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే; సాహసించి ఒక్కో అడుగూ పైకి నడిస్తే — శిఖరాగ్రం మీదనే.

వివరం →

మంచి వారితో స్నేహం ఉదయపు ఎండలా పెరుగుతుంది. చెడ్డ వారితో స్నేహం సాయంత్రపు ఎండలా తరిగి పోతుంది.

వివరం →

ఒకరిని ఎంతకాలమైతే మనం అనుకరిస్తూ వుంటామో, అంతకాలం మనం ముందుకు వెళ్ళలేము.

వివరం →

ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యంకాదు. అది ఒక సంతోషం. ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది.

వివరం →

మన మనస్సు పవిత్రంగా ఉండి ఏ చిన్న పనిచేసినా అది విజయవంతం అవుతుంది.

వివరం →

భవిష్యత్తులో ఏమి కానున్నదో అని భయపడకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడే నిజమైన ధీరుడు.

వివరం →

ధనవంతుడు అంటే ఎలా సంపాదించాలో తెలిసినవాడు కాదట, ఎంత సక్రమంగా ఖర్చుపెట్టాలో తెలిసినవాడట.

వివరం →

ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నా నువ్వు మాత్రం వారి మంచినే కోరు.

వివరం →

సలహా అనేది మీ స్నేహితులను కేవలం సంతోష పెట్టేదిగా కాదు, సహాయ పడేదిగా వుండాలి.

వివరం →

పొగడ్త పన్నీరులాంటిది దాన్ని వాసన చూడాలే తప్ప తాగకూడదు.

వివరం →

వివేకి అయిన మానవుడు ప్రతీ క్షణాన్ని సద్వినియోగపరచుకోవాలి.

వివరం →

మహాత్ముల స్ఫూర్తిని పొందినవారు గొప్పగా ఆలోచిస్తారు. త్యాగాలు చేస్తారు. అద్భుతాలు సృష్టిస్తారు.

వివరం →

పొరుగింటి గోడలు శుభ్రంగాలేవని విమర్శించడం కాదు. నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో.

వివరం →

ఒక గొప్ప పుస్తకం చదివినప్పుడు ఓ కొత్త స్నేహితుడు దొరికినంత సంబరమూ, దాన్ని మళ్ళీ చదివినప్పుడు చిరకాల మిత్రుణ్ణి కలిసినంత ఆనందమూ కలుగుతుంది.

వివరం →

దృఢమైన సంకల్పం, స్థిరమైన కృషి వుంటే విజయం తప్పక లభిస్తుంది.

వివరం →

రహస్యం — నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని.

వివరం →

గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరయినట్లే.

వివరం →

జీవితం ఓ యుద్ధభూమి, పోరాడితే గెలిచేందుకూ అవకాశం ఉంటుంది. ఊరక నిలుచుంటే మాత్రం ఓటమి తప్పదు.

వివరం →

కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తెలివి హీనతో, సహనం వహిస్తున్నారు కదా అని ఉత్తములను తక్కువగా అంచనా వేయడమూ అంతే.

వివరం →

కష్టాలలో ఉన్నవారిని చూసి దుర్భలులు బాధపడతారు, ధీరులు సాయపడతారు.

వివరం →

ఉన్నత లక్ష్యాలనే కలిగి వుండు, అత్యున్నతమైన దానిని సాధించాలని గాఢంగా కోరుకో.

వివరం →

ఈ ప్రపంచంలో సమర్థుడు నిద్రపోడు. అసమర్థుడు సమాజంలోనికి రాడు.

వివరం →

ఉపాధ్యాయుడు నిరంతరం నేర్చుకుంటూ ఉంటే తప్ప ఇతరులకు బోధించలేడు. దీపం తాను వెలుగుతూ ఉంటే తప్ప మరో దీపాన్ని వెలిగించలేదు.

వివరం →

చదువంటే మనకు కావలసినదంతా తెలుసుకోవటం. జ్ఞానం అంటే మనకు అవసరం లేనిది వదిలి పెట్టగలగటం.

వివరం →

ధీరులంటే ప్రపంచాన్ని జయించిన వారు కాదు. తన మనస్సును జయించిన వారే నిజమైన ధీరులు.

వివరం →

ధనాన్ని ఎవరైనా కూడ బెట్టగలరు. కానీ ధర్మాన్ని కూడబెట్టిన వారే ధన్యాత్ములు.

వివరం →

సృష్టిలో తీయనిది స్నేహమే. హితం కోరేవాడే అసలైన స్నేహితుడు.

వివరం →

మనం ఏమిటన్నది గుర్తించనంతకాలం మన జీవితం మారదు.

వివరం →

మనిషికి బాగా అవసరమయ్యేది కాలమే! అయితే మనిషి ఎక్కువగా దుర్వినియోగం చేసుకునేది కూడా కాలాన్నే!

వివరం →

చిన్నపొరపాటే కదా అని నిర్లక్ష్యం తగదు, పెద్ద ఓడను ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు.

వివరం →

ఇతరులు చేసిన ఏ పనివల్ల నీ మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పనిని నీవు ఇతరులకు చేయవద్దు.

వివరం →

విద్య వినయాన్ని పెంపొందించాలి. వినయం లేని విద్య వ్యర్థం. విద్య వినయంతో కూడినప్పుడే అహంకారం నుండి తప్పించుకోగలుగుతారు. స్థితి పెరుగుతున్న కొద్దీ అణకువ, వినయం పెరగాలి. వినయం పెంచుకునే కొలది శాంతి లభిస్తుంది.

వివరం →

జీవితంపట్ల అవగాహన ఉన్న వ్యక్తి జీవితాన్ని సద్వినియోగపరచుకుంటాడు.

వివరం →

నిరంతరం తపన, ఆరాటం వుండాలి అదే తపస్సు. తపస్సు ద్వారా మనిషి సాధించలేనిది ఉండదు.

వివరం →

అన్నదానం, వస్త్రదానం, ప్రాణదానం కన్నా జ్ఞానదానం చాలా ఉన్నతమైనది.

వివరం →

సమదృష్టితో సమాజాన్ని చూడాలి. సత్యవంతంగా జీవితాన్ని కొనసాగించాలి.

వివరం →

సత్యం, అహింస, సేవానిరతి, క్రమశిక్షణ, క్షమాగుణం, ఇవే విజయానికి మూల సూత్రాలు.

వివరం →

శ్రమయే మనుషుల్ని అదృష్టవంతుల్ని చేస్తుంది.

వివరం →

విద్య జ్ఞానాన్నిస్తుంది. విలువలు సత్ప్రవర్తన నిర్మాణానికి పునాదులు వేస్తాయి. విశాల మానవప్రపంచం గురించి ఆలోచింపజేసి మరింత ముందుకు నడిపిస్తుంది ధైర్యం.

వివరం →

మహాత్ములు ఒక్క నిమిషమైనను వ్యర్థముగా గడపరు.

వివరం →

నేటి తెలివైన నిర్ణయం, రేపటి బంగారు భవితకు పునాది.

వివరం →

గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవాలి. వారి ఆలోచనలనుండి స్ఫూర్తి పొందుతూ వుండాలి, అప్పుడే వారి లక్షణాలు మనకు వస్తాయి.

వివరం →

ఆశలు, ఆశయాలు అందరికీ వుంటాయి. కాని నిత్యం శ్రమించేవారే వాటిని నేర్చుకోగలుగుతారు.

వివరం →

ఇంటికప్పులోని రంధ్రం ఎండలో కన్పించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది.

వివరం →

తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నా కిష్టం. తన దేశానికి గర్వకారణంగా నిలిచే మనిషంటే మరీ ఇష్టం.

వివరం →

మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం.

వివరం →

మనిషి ఎప్పుడూ తనకున్న సంపదతో తృప్తి పడాలి: కానీ తనకున్న విజ్ఞానంతో తృప్తి పడకూడదు.

వివరం →

అభినందించడం తప్ప అసూయపడటం ఎరుగనివాడు ఎంతో అదృష్టవంతుడు.

వివరం →

జీవితం వృథా చేసుకోవడానికి కాదు, చైతన్యవంతంగా ప్రయోజనాత్మకంగా జీవించడానికి.

వివరం →

మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్శాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్లాలి.

వివరం →

జ్ఞానం అమాంతంగా పొంగిపొర్లదు. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది.

వివరం →

సంపాదించడం అందరికీ తెలుసు, కానీ ఖర్చెలా చేయాలన్నది మాత్రం లక్షల్లో ఒక్కరికే తెలుసు.

వివరం →

జీవితంలో ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది.

వివరం →

అందం నడవడికలో వుంటుంది కానీ, ఆడంబరాలలో కాదు.

వివరం →

జనులు నిన్ను ఏమైనా అననివ్వు. నీ దృఢ నిశ్చయాన్నే అంటిపెట్టుకో, అలాగైతే కావలసినదంతా తప్పకుండా లభిస్తుంది. యావత్ప్రపంచం నీకు జేజేలు పలుకుతుంది.

వివరం →

ఒక్కతప్ప కూడా చెయ్యని వ్యక్తిని మీరు చూపిస్తే ఒక్కపని కూడా చెయ్యని వ్యక్తిని నేను చూపిస్తా.

వివరం →

దేవుడు మనకు నోరిచ్చింది నాలుగు మంచి మాటలు మాట్లాడమని, చేతులిచ్చింది నాలుగు మంచి పనులు చేయమని.

వివరం →

లోభ, మోహాలను వదులుకున్నప్పుడే మనిషి తన మనస్సును అదుపు చేయగలుగుతాడు.

వివరం →

బలహీనులే అదృష్టాన్ని నమ్ముతారు. ధీరులెప్పుడూ కార్య కారణ సంబంధాన్నే విశ్వసిస్తారు.

వివరం →

సక్రమంగా ఉండాలా దయగా ఉండాలా అన్న సంశయం వస్తే దయవైపే మొగ్గు, అది ఎప్పుడూ సక్రమమే అవుతుంది.

వివరం →

అతి కష్టమైన పని — నిన్ను నువ్వు తెలుసుకోవడం. అతి తేలికైన పని ఇతరులకు సలహాలివ్వడం.

వివరం →

ఇతరులు నీపై నమ్మకం పెంచుకోవాలంటే ముందు ఎదుటివారు నీపై నమ్మకం పెంచుకునేలా జీవించు.

వివరం →

మేలు చేయక పోయినా ఫరవాలేదు. ఎవరికీ కీడు మాత్రం చేయకూడదు.

వివరం →

ఒక స్థితి నుండి ఉన్నతంగా ఎదిగేందుకు ప్రయత్నించడమే యోగం.

వివరం →

ఎన్ని సమస్యలెదురైనా దృఢచిత్తంతో, ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి.

వివరం →

మనం ఎందుకు జన్మించామో తెలుసుకోకుండానే మనలో చాలామంది ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు.

వివరం →

మంచి పుస్తకాలు త్వరపడి చదవకపోతే ముందు ముందు వాటిని చదివే అవకాశమే ఉండక పోవచ్చు.

వివరం →

రాళ్ళలాగా ఎక్కడంటే అక్కడ దొరక్కుండా అరుదుగా లభిస్తాయి కనుకే వజ్రాలకంత విలువ — ప్రశంసలైనా అంతే!

వివరం →

మనిషి అత్యంత ఉన్నతమైన శిఖరాలకు ఎక్కవచ్చు. కాని అతను అక్కడే ఎక్కువ కాలం వుండలేడు.

వివరం →

దానము చేయని ధనము, సంస్కారములేని చదువు వ్యర్థము.

వివరం →

నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు నీ వైపుకు వేస్తుంది.

వివరం →

చెట్టు తన పండు తాను తినదు. నది తన నీరు తాను త్రాగదు. అట్లే సత్పురుషులు చేయు పనులు పరుల కోసమే చేస్తారు.

వివరం →

డబ్బు కాదు — డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనార్థాలకు హేతువులు.

వివరం →

యజమానికీ నాయకుడికీ తేడా ఒకటే — 'మీరు చేయండి' అంటాడు యజమాని, 'మనం చేద్దాం' అంటాడు నాయకుడు.

వివరం →

మనకు రెండు రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పాలి, రెండోది ఎలా జీవించాలో నేర్పాలి.

వివరం →

ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత వుంటుంది.

వివరం →

సత్యవంతంగా జీవించే వ్యక్తికి సాధన చేయవలసిన పనిలేదు.

వివరం →

మనీ గురించే గాక మానవత్వం గురించి ఆలోచించండి.

వివరం →

మనిషికి మంచి స్వయంశిక్షణ ఉంటే ఇతరులు అమర్యాదగా ప్రవర్తించినా పట్టించుకోడు.

వివరం →

స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు.

వివరం →

ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టనష్టాలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.

వివరం →

నీ మీద నీకు నమ్మకం పెరుగుతున్నప్పుడు నీ సమర్థత కూడా పెరుగుతుంది.

వివరం →

మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది. మరొకటి దాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతివారూ దీపం కాలేకపోవచ్చు. కాని అద్దం కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచడమే జీవితం.

వివరం →

విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేవారు ఎన్నడూ ఏ పనీ చేయలేరు.

వివరం →

కాలాన్ని ఏ మాత్రం వృథా చేయకుండా, ఎప్పుడూ ఏదో ఉపయోగపడే పని చేస్తూ వుండాలి.

వివరం →

ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి మాత్రమే సరైన ఆరోగ్యవంతుడు.

వివరం →

గెలవాలన్న తపన బలీయంగా ఉన్నచోట ఓటమి అడుగైనా పెట్టలేదు.

వివరం →

విజేత వెనుక ఉండేది అదృష్టమో, మంత్రదండమో కాదు — కఠిన శ్రమ, అంకిత భావం.

వివరం →

ఒక వ్యక్తిని గొప్పవానిగా చేసేవి ధన, కనక, వస్తు, వాహనాలు కావు. అతని వ్యక్తిత్వం.

వివరం →

దురలవాట్లు మొదట్లో సాలె గూళ్ళులాంటివి. తర్వాత అవి ఇనుప గొలుసులై మిమ్మల్ని బంధిస్తాయి.

వివరం →

బాధ్యతగా జీవించడం ముఖ్యం, బాధ్యతతో అందరూ జీవించేలా ప్రయత్నించాలి.

వివరం →

మనసుపెట్టి పనిచేస్తే, ఏ వృత్తిలో, ఏ పనిలోనైనా కలిగే తృప్తే మనిషికి ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. అప్పుడు ఆకలి, నిద్ర అసలు గుర్తుకు రావు.

వివరం →

జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవచ్చు.

వివరం →

జీవితంలోని అందం, ఆనందం అతి పెద్ద విషయాలలో కాదు — అతి చిన్న విషయాలలో దాగి వుంది.

వివరం →

సంకల్పబలం వుంటే తలచిన పని సునాయాసంగా పూర్తవుతుంది.

వివరం →

ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో అంతేకాని తీసుకోవడం కాదు. అలాగే ఇతరులకు సేవ చేయడం నేర్చుకో పెత్తనం చెలాయించడం కాదు.

వివరం →

ఒక మంచి స్నేహితుడ్ని ఎన్ని కష్టాలొచ్చినా నిలుపుకో. ఒక దుర్గుణం కలవాడ్ని ఎంతటి వాడైనా వదులుకో.

వివరం →

ఉన్నత మనస్కుడు ఒకరిని అవమానించడు. అవమానాన్ని సహించడు.

వివరం →

మాటలకు చేతలకు తేడా ఉన్నదంటే మనసులో ఏదో స్వార్థం ఉన్నట్లే

వివరం →

వివేకులు సంతోషంగా జీవిస్తారు. సామాన్యులు సంతోషం కోసం పాకులాడుతారు.

వివరం →

కష్టమైనా సాధించగలననుకునేవాడే అసలైన విజేత.

వివరం →

నువ్వెంత కష్టపడి పనిచేస్తున్నావో చెప్పొద్దు. ఎంతపని పూర్తయిందో చెప్పు

వివరం →

పట్టుదల, సహనం, పవిత్రత అనేవి జీవిత ప్రధాన సూత్రాలు.

వివరం →

పరుల మేలు కోసం చేసిన పని ఎంత చిన్నదైనా అది మనలోని అంతశ్శక్తిని మేలుకొల్పుతుంది. ఇతరులకు కాస్త ఉపకారాన్ని ఊహించటం సైతం హృదయంలో సింహబలాన్ని నెలకొల్పుతుంది.

వివరం →

కష్టమైన కార్యనిర్వహణ ద్వారానే నిజమైన ఆనందం దొరుకుతుంది.

వివరం →

జ్ణానం వంశపారపర్య సంపద కాదు. ఎవరికివారు కష్టపడి ఆర్జించుకోవలసిందే.

వివరం →

ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు.

వివరం →

మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నయినా మరుసటి రోజుకల్లా మర్చిపోగలుగుతారు.

వివరం →

మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవ్వరూ కించపరచలేరు.

వివరం →

వ్యక్తిగతంగా ఒక మనిషి గురించి తెలుసుకోవడం కన్నా మొత్తం మానవజాతి గురించి తెలుసుకోవడం సులభం.

వివరం →

గొప్ప గుణాలుంటే సరిపోదు, వాటిని వినియోగించుకోగలగాలి.

వివరం →

మనిషిని మహనీయునిగా మార్చేది, మాటలు నెమ్మదిగాను, వనులు ఉత్సాహాంగాను చేసిననాడే.

వివరం →

మనం ఆనందం పొందడం కన్నా, ఇతరులకు ఆనందాన్ని పంచడంలోనే ఎక్కువ ఆనందం లభిస్తుంది.

వివరం →

అందర్నీ సంతృప్తి పరచాలనుకుంటే ఒక్కరి కూడా సంతృప్తి పరచలేము.

వివరం →

ఆత్మవిశ్వాసం వున్న వ్యక్తి ఇతరులను తనవెంట నడిపింపజేసే నాయకుడు అవుతాడు.

వివరం →

ఏ మంచిని, ఏ నమ్మకాన్ని నీవు ఎదుటివారి నుండి ఆశిస్తున్నావో, అవి ముందుగా నీ నుండే ప్రారంభం కావాలి.

వివరం →

మనుషులు రెండు రకాలు — పని చేసే వాళ్ళు, గొప్పలు చెప్పుకునే వాళ్ళు. మొదటి వారితో ఉండటమే సయం, అక్కడ పోటీ తక్కువ.

వివరం →

అంతరాయాలు కలుగుతున్న కొద్దీ సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ పోవాలి.

వివరం →

ఏం చేయాలి, ఎలా చేయాలి అని అర్థమయ్యే వరకూ చేస్తూనే ఉండాలి.

వివరం →

మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగా వుంటుంది.

వివరం →

కష్టం ఎరుగని వాడికి సుఖం విలువ తెలియదు.

వివరం →

విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు. అన్నివేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు. అపజయం మరణమూ కాదు. రెండింటి కంటే ముఖ్యమైంది ధైర్యం.

వివరం →

మనిషి విజయం, ఆర్జించిన డబ్బుబట్టి కాక సాధించిన మనశ్శాంతినిబట్టి ఉంటుంది.

వివరం →

ప్రతి మనిషిలోనూ మంచి చెడులు వుంటాయి. వారిలో చెడును మాత్రమే చూస్తే ముందుకు సాగలేము.

వివరం →

వినయశీలురవద్ద అహంభావం చూపవద్దు, అహంకారులతో వినయంగా ఉండవద్దు.

వివరం →

దుష్టులకు దూరంగా ఉండాలి. కానీ వారితో విరోధంగా ఉండకూడదు.

వివరం →

అజ్ఞానం అహంకారానికి దారి తీస్తుంది. అహంకారం తీవ్ర అజ్ఞానానికి దారి తీస్తుంది.

వివరం →

చేయకుండా చేసామనేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేసానని చెప్పేవాడు గర్విష్టి ఎంతో చేసి కొంచెమే చేసానని చెప్పేవాడు సజ్జనుడు.

వివరం →

మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితేనే అవి నిజమైన విజయాలు.

వివరం →

స్వేచ్ఛగా జీవించే వ్యక్తి తన చుట్టూ గొప్ప వ్యక్తులను సృష్టించుకుంటాడు.

వివరం →

ఒక ఊరు బాగుపడాలంటే ఒక మంచి మనిషి పూనుకోవలసి వుంటుంది.

వివరం →

పరిస్థితులెప్పుడూ అనుకూలంగా ఉండాలని ఆశించవద్దు. ఈ ప్రపంచం నీ వొక్కడి కొరకే ఏర్పడలేదు.

వివరం →

ఏదో జరగాలని ఎదురుచూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏదిచేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగితే గెలుపు సాధ్యం.

వివరం →

వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. వ్యక్తులు మారకుండా వ్యవస్థను మార్చలేం.

వివరం →

మంచి పని చేయడానికి డబ్బుకన్నా దృఢ సంకల్పం మరింత అవసరం.

వివరం →

కనిపించేదాన్ని చూడటానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి.

వివరం →

నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారికి నిరాశ అనేది కలగదు.

వివరం →

ఎక్కడ నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది.

వివరం →

ఏమీ చేయకుండా ఉండటం కన్నా సమాజానికి మేలు చేసే పనిని చేయడం ఉత్తమం.

వివరం →

అన్నదానం ఆకలిని తీర్చగలుగుతుంది. అక్షరదానం అజ్ఞానాన్ని తొలగించ గలుతుంది.

వివరం →

జ్ఞానం పెరిగే కొద్దీ తన అజ్ఞానం ఎంతో తెలిసి వస్తూంటుంది.

వివరం →

ఒక మాట మాట్లాడేటప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడకూడదు.

వివరం →

ఒక మంచి పుస్తకం మన దృక్పథాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది.

వివరం →

పుస్తకాలూ, స్నేహితులూ కొద్దిగా ఉన్నా మేలైనవిగా ఉండాలి.

వివరం →

అవినీతిపరుడైన బంధువు కన్న, నిజాయితీ పరుడైన శత్రువు మిన్న.

వివరం →

కోరికలతో జీవించే వ్యక్తికి సేవాభావం ఉండదు. సేవాభావంతో జీవించే వ్యక్తికి కోరికలు ఉండవు.

వివరం →

మన మంచిని ఇతరులు చెప్పుకోవడం ఘనత. మనమే చెప్పుకోవడం పొగడ్త.

వివరం →

సహనం గల మనిషి తను అనుకున్న వాటినల్లా సాధించుకోగలిగే అద్భుతమైన సంకల్ప శక్తి కలిగి ఉంటాడు.

వివరం →

అసంతృప్తికి మూలకారణం ఇతరులతో పోల్చుకొనడమే.

వివరం →

పండితుడంటే విషయం తెలిసినవాడు. జ్ఞాని అంటే తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టేవాడు.

వివరం →

స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనస్సే.

వివరం →

ప్రపంచంలోని మేధావులందరికన్నా, ఒక మంచి సహృదయంగల వ్యక్తి ఎంతో గొప్పవాడు.

వివరం →

పనిచేసే తత్వమూ, పనిపట్ల విశ్వాసమూ విజయానికి మూలకారణాలు.

వివరం →

నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి పారిపోతుంది. నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది.

వివరం →

శ్రద్ధ, నిజాయితీ, విధేయత, సత్యాన్వేషణ, కష్టపడి పనిచేసే గుణం విజయానికి సోపానాలు.

వివరం →

జీవితాన్ని ప్రేమించేవారు, సమయాన్ని వృథా చేయరు.

వివరం →

చెప్పిన వేళకు రానివాడు, కాలం విలువ తెలియనివాడు. అతడు నిజాయితీ పరుడంటే నమ్మవద్దు.

వివరం →

తప్పు చేసారని ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు.

వివరం →

విజయం సాధించాలనే మీ సంకల్పమే అన్నింటికంటే ముఖ్యమని అనుక్షణం గుర్తు చేసుకోండి.

వివరం →

జీవితం ఒక అపూర్వ వరం. దాన్ని చరితార్థం చేసుకోవాలి.

వివరం →

ఈ ప్రపంచమంతా నీకు దూరంగా వెళ్ళినపుడు నీకు దగ్గరగా వచ్చేవాడే నిజమైన స్నేహితుడు.

వివరం →

ప్రేమ గొప్పదే కాని స్నేహం అంతకంటే గొప్పది. స్నేహం ఆనందాన్ని పెంచుతుంది: విచారాన్ని పంచుకుంటుంది.

వివరం →

సాధారణ వ్యక్తులుగా కన్పించినంత మాత్రాన గొప్పవారు సాధారణ వ్యక్తులుకారు.

వివరం →

గతం నుంచి ఏమీ నేర్చుకోనివాడు భవిష్యత్తులో కష్టపడతాడు.

వివరం →

ఆకు చివర నీటి బిందువులా కాలం అంచుల్లో నీ జీవితాన్ని నృత్యం చేయించు.

వివరం →

మనిషి వ్యక్తిత్వం అతని హోదానిబట్టి కాక ప్రవర్తనను బట్టి తెలుస్తుంది.

వివరం →

ఉత్తముడు చేతల్లో చురుగ్గావుంటాడు. అధముడు మాటల్లో చురుగ్గా వుంటాడు.

వివరం →

తనకు లేని వాటి కోసం విచారించక, తనకు వున్న వాటికి సంతోషించే వ్యక్తి తెలివైన వాడు.

వివరం →

బుద్ధిమంతుడైన వాడు ముందు తనలోని అవగుణాలను గుర్తించి సరిదిద్దు కుంటాడు. ఆ తరువాత ఎదుటివారి సద్గుణాలను గుర్తించి స్వంతం చేసుకుంటాడు.

వివరం →

సుదూరంలో అస్పష్టంగా కన్పించేదానికన్నా, మిన్నగా సమీపంలో స్పష్టంగా కనిపించేది మన లక్ష్యం కావాలి.

వివరం →

నీతిని బోధించడానికి అర్హతలేనివాళ్లు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే, ప్రజలకు ఆ వ్యక్తుల మీదే కాక అసలు నీతిమీదే నిరసన భావం ఏర్పడే ప్రమాదం ఉంది.

వివరం →

ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే కలిగే జ్ఞానం జీవితం మొత్తం మీద గడించిన అనుభవ పాఠంతో సమానం.

వివరం →

ఎప్పుడూ ఒప్పుకోకు ఓటమిని, ఎప్పుడూ వదులుకోకు ఓర్హుని.

వివరం →

పనితనం లేనివాడు పనిముట్లను నిందించకూడదు.

వివరం →

ఒక దురభ్యాసానికి అయ్యే ఖర్చుతో ఒక బిడ్డను పెంచి పోషించవచ్చు.

వివరం →

సంతృప్తిగలవాడు మట్టిని ముట్టినా బంగారమవుతుంది.

వివరం →

ఒక లక్ష్యంతో కృషి చేసిన వ్యక్తి నేడు కాక పోయినా, రేపైనా విజయం సాధిస్తాడు.

వివరం →

ఏదైనా పని చేయడానికి బద్ధకిస్తే ఆ పనిని పదిసార్లు తిరిగి చేయాల్సి వస్తుంది.

వివరం →

బలహీనుడు ఎప్పటికీ క్షమించలేడు. క్షమా గుణం బలవంతుల లక్షణం.

వివరం →

ఎలా నిరీక్షించాలో తెలియడం విజయసాధనకు గొప్ప రహస్యం.

వివరం →

గొప్ప వ్యక్తి శీలానికి, సత్ప్రవర్తనకు, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తాడు.

వివరం →

జీవితం బరువు బాధ్యతలను ఆనందంతో వహించడం నేర్చుకోవాలి. ఇబ్బందులు ఎదురైనపుడు ధైర్యంగా పోరాడి విజయం సాధించాలి.

వివరం →

వికాసమే జీవనం, సంకోచమే మరణం. ప్రేమే జీవనం, ద్వేషమే మరణం.

వివరం →

గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవడం నేరం.

వివరం →

నీటిబిందువు కాలుతున్న పెనంమీద పడితే రూపురేఖలు లేకుండా ఆవిరవుతుంది. తామరాకు మీద పడితే అంటీ అంటకుండా వుంటుంది. ముత్యపు చిప్పలో పడితే ముత్యమై మెరుస్తుంది. అలాగే, మనిషి నీచుడి నీడ చేరితే నశిస్తాడు. మధ్యముడి వెంట ఉంటే ఆ మాత్రపు ప్రతిష్ఠనే పొందుతాడు. ఉత్తముడిని ఆశ్రయిస్తే ఉజ్వలంగా వెలుగుతాడు.

వివరం →

ఆశావాది గులాబీని చూస్తే, నిరాశావాది దాని కింద ముల్లును చూస్తాడు.

వివరం →

వేలకొద్దీ నీతులు బోధించే బదులు ఒక్క మంచి పనిచేసి చూపించడం మేలు.

వివరం →

మంచితనానికి అసలైన, నిదర్శనాలేవంటే ఇతరుల తప్పులను క్షమించడం, మరచిపోవడం.

వివరం →

ఆశయాల కోసం జీవించాలి కానీ ఆశల కోసం కాదు.

వివరం →

మంచి ఎక్కడ వున్నా పరిగ్రహించు. చెడు ఎక్కడ ఉన్నా పరిత్యజించు.

వివరం →

నీ తప్పుల్ని ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు.

వివరం →

ఎవరైతే ఎల్లప్పుడూ నిజాన్నే మాట్లాడతారో వారి చెంత భగవంతుడు ఉంటాడు.

వివరం →

కార్యసాధకులైనవారు శరీరసుఖాలకోసం పాకులాడరు. కష్టసుఖాలను లక్ష్యపెట్టరు.

వివరం →

ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు — రహస్యాన్ని కాపాడడం, అవమానాన్ని మరచిపోవడం, సమయాన్ని, సద్వినియోగం చేయడం.

వివరం →

నీ భయం నీ దగ్గరే ఉంచుకో, నీ ధైర్యాన్ని మాత్రం పదిమందికీ పంచు.

వివరం →

ఒక గొప్పవాని గొప్పతనం, అతడు తనకంటే తక్కువ వారితో వ్యవహరించే తీరును బట్టి తెలుస్తుంది.

వివరం →
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి