అమెరికాలోని తెలుగు వారి ప్రతిష్టాత్మక సంస్థ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ – మాటా (MATA) తమ రెండో మహాసభలు 2026కు సిద్ధమవుతూ కార్యక్రమాలను వేగవంతం చేసింది.
ఈ సందర్భంగా న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించింది. స్వరాజ్ టీవీ కార్యాలయంలో జరిగిన ఈ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.
1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించిన ఈ అన్‌రేటెడ్ పోటీలు 5 రౌండ్ స్విస్ సిస్టమ్ విధానంలో నిర్వహించబడ్డాయి.
చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని తమ చెస్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పోటీలు ఆసక్తికరంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన వారికి, రాబోయే మాటా కన్వెన్షన్ 2026 చెస్ ఛాంపియన్‌షిప్లో పాల్గొనే ప్రత్యేక అవకాశం కల్పించనున్నారు.












