అమెరికా తెలుగు సంఘం...ఆటా జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో జరగనున్న 19వ జాతీయ మహాసభలను పురస్కరించుకుని న్యూజెర్సీలో ఫండ్‌రైజింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఏప్రిల్ 18న రాయల్ అల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఫండ్‌రైజింగ్ కార్యక్రమాన్ని విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి సుమారు 250 మంది హాజరయ్యారు.
ఆటా 19వ మహాసభలు మరియు యువజన సదస్సు కోసం మొత్తం 6 లక్షల 25 వేల అమెరికన్ డాలర్లు సేకరించబడినట్లు ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి ఆనందంగా ప్రకటించారు.
అధ్యక్షుడు జయంత్ చల్లా , ఈ మహాసభల ప్రాముఖ్యతను వివరించి, తెలుగు ప్రజలంతా ఐక్యంగా ముందుకు వచ్చి ఈ వేడుకలను ఘన విజయం సాధించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
ట్రస్టీలు విజయ్ కుందూర్ మరియు కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్, కార్యక్రమాల గురించి వివరించి, అందరూ చురుకుగా పాల్గొనాలని కోరారు. నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ఈ మహాసభలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల మహోత్సవంగా నిలుస్తాయని తెలిపారు.
ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి , దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పాటలు, నృత్యాలు, బ్యూటీ పోటీలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. మహిళా సాధికారత మరియు ఇమ్మిగ్రేషన్ సమస్యలు ముఖ్యాంశాలుగా ఉంటాయని చెప్పారు. పాస్ట్ ప్రెసిడెంట్ పరమేశ్ భీమ్రెడ్డి, BOT సభ్యులు రాజు కాకర్ల, శ్రీని దర్గుల, రవీందర్ గుడూర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలు మరియు నిర్వాహక బృందం సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది






