అమెరికాలో ప్రముఖ ఎన్నారై, తన నిస్వార్థ సేవలతో అటు అమెరికాకు ఇటు భారతదేశానికి ముద్దుబిడ్డగా నిలిచిన సామాజిక సేవకుడు దాము గేదెలకు అరుదైన గౌరవం లభించింది. తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఆయనకు “జీవన సాఫల్య పురస్కారం” ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది.
తెలుగు కళా సమితి TFAS ఉగాది వేడుకల సందర్భంగా ఇటీవల న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో ఈ సత్కారం ఘనంగా నిర్వహించారు. TFAS అధ్యక్షుడు అన్నా మధుసూధనరావు మరియు కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
సభలో పాల్గొన్న ప్రతినిధులు, సభికులు దాము గేదెల సేవలను కొనియాడుతూ, ఆయన నిబద్ధత భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.



















