ఒక నటుడిగా తెరపై అడుగుపెట్టారు…

తనదైన స్టైల్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు…

యువతకు ఓ ఐకాన్‌గా మారారు…

ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు…

ఓటములు ఎదురైనా వెనక్కి తగ్గలేదు…

ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకు సాగారు…

చివరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి… డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఇది పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్…

ఒక నటుడి నుంచి ప్రజా నాయకుడిగా సాగిన అసాధారణ ప్రయాణం.

సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా…

తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే తపనతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలైన ప్రయాణం…

తర్వాత వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగి ‘ఖుషి’ లాంటి సినిమాలతో యువతలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

సినిమాల్లో ఆయన స్టైల్…

ఆయన డైలాగ్ డెలివరీ…

ఆయన మ్యానరిజమ్స్…

ఇవన్నీ కలిసి పవన్ కళ్యాణ్‌ను కేవలం హీరోగా కాకుండా… యూత్ ఐకాన్‌గా నిలబెట్టాయి.అయితే… పవన్ కళ్యాణ్ ప్రయాణం సినిమాలతోనే ఆగిపోలేదు.సమాజంపై తనకున్న ఆలోచనలను ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతో…2014లో జనసేన పార్టీని స్థాపించారు.

అధికారం కోసం కాదు…

ప్రజల కోసం ప్రశ్నించడమే లక్ష్యమంటూ రాజకీయాల్లోకి వచ్చారు.

ఆ సమయంలో జనసేన తీసుకున్న నిర్ణయాలు…

ఆ పార్టీ చేసిన రాజకీయ ప్రచారం…

పవన్ కళ్యాణ్‌ను మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాయి.

రాజకీయ ప్రయాణంలోఎన్నో ఒడిదుడుకులు ఎన్నో పరీక్షలు.....రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత…

పవన్ కళ్యాణ్‌కు విజయాల కంటే ముందుగా ఎదురైనవి సవాళ్లే.

2019 ఎన్నికల్లో జనసేనకు ఎదురైన ఫలితాలు…

పవన్ కళ్యాణ్‌కు వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ కఠిన పరీక్షగా మారాయి.

కానీ… ఓటమి ఆయన అడుగులను ఆపలేదు.

వెనక్కి తగ్గలేదు…

పార్టీని వదల్లేదు…

రాజకీయ పోరాటాన్ని ఆపలేదు.

ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ…

ప్రజల్లో తన రాజకీయ బలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగారు.

తన చరిష్మా తో.... రాజకీయ సమీకరణాలు మార్చేసిన పవన్

2024 ఎన్నికలు ....పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారాయి.తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగడంతో…ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడ్డాయి.జనసేన పోటీ చేసిన స్థానాల్లో ఘన విజయం సాధించింది.21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి… 21 స్థానాల్లో విజయం.పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఘన విజయం సాధించారు.

అక్కడితో…

ఒకప్పుడు సినిమా తెరపై అభిమానుల చేత పవర్‌స్టార్గా పిలవబడిన వ్యక్తి…

రాజకీయ తెరపై కీలక నాయకుడిగా నిలిచారు.

ఇక 2024లో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో…పవన్ కళ్యాణ్‌కు కీలక బాధ్యతలు దక్కాయి.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా…

ప్రజా జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు పవన్ కల్యాణ్.అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా పలు కీలక శాఖల బాధ్యతలు చేపట్టారు.

ఇది కేవలం పదవి కాదు…

సినిమా హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన వ్యక్తి…ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడిగా…

రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్న సందర్భం.

ఒకప్పుడు తెరపై హీరో…

ఆ తర్వాత యువత గుండెల్లో ఐకాన్…

అక్కడి నుంచి రాజకీయాల్లోకి అడుగు…

ఓటములు… విమర్శలు… సవాళ్లు…

అయినా లక్ష్యాన్ని వీడని ప్రయాణం…

చివరకు ప్రజల తీర్పుతో అసెంబ్లీలో అడుగు…

ప్రభుత్వంలో కీలక బాధ్యత…

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి…

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు…

ఇది ఒక్కరోజులో జరిగిన మార్పు కాదు…

దశాబ్దాల ప్రయాణం…

ఎన్నో మలుపులు…

ఎన్నో పోరాటాలు…

ఎన్నో ఎదురుదెబ్బలు…

అయినా ఆగని అడుగులు…

తెరపై అభిమానుల హీరోగా మొదలైన ప్రస్థానం…

ప్రజల మధ్య నాయకుడిగా మారింది.

అదే పవన్ కళ్యాణ్ ప్రయాణం…

ఒక నటుడి నుంచి…

యూత్ ఐకాన్‌గా…

జనసేనాని నుంచి…

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా!

We wish u a happy Birthday our own power Star Pawan Kalyan