సినీ పరిశ్రమలో జరుగుతున్న పర్సెంటేజీ వివాదంపై నిర్మాత బన్నీ వాసు ఘాటుగా స్పందించారు. ప్రేక్షకులు థియేటర్లకు తగ్గిపోవడంతో సినిమా ఆదాయం భారీగా పడిపోయిందని అన్నారు. పెద్ద సినిమాల కలెక్షన్లు పెరిగినట్లు కనిపిస్తున్నా, అది ప్రేక్షకుల సంఖ్య వల్ల కాదు.. టికెట్ రేట్లు పెరగడం వల్లేనని వ్యాఖ్యానించారు.
చిన్న సినిమాల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ఇప్పుడు తగ్గిపోయిన ఆదాయాన్ని పంచుకోవడంపై పోరాడుతున్నామే గానీ, అసలు ప్రేక్షకులు ఎందుకు థియేటర్లకు రావడం తగ్గిందో ఆలోచించడం లేదన్నారు. నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఇద్దరూ నష్టపోతున్నారని చెప్పిన ఆయన.. ఆదాయంలో వాటాల కంటే, సమస్యకు మూలకారణం ఏంటో గుర్తించి దాన్ని సరిచేయడం ముఖ్యమని సూచించారు.













