సమాజ రచయిత
డా. నరసింహారెడ్డి ఊరిమిండి: నెల్లూరు జిల్లా పొంగూరులో జన్మించి, గత ముప్పై ఆరు సంవత్సరాలుగా డాలస్ టెక్సస్ లో నివసిస్తూ, టెలికం–ఐటీ రంగాల్లో మూడు దశాబ్దాలకుపైగా సేవలందిస్తూ, విద్యాబోధనపై ప్రేమతో రెండున్నర దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా కొనసాగుతున్నారు. తెలుగు భాషా–సాహిత్యాభిమాని అయిన ఆయన TANTEX అధ్యక్షుడిగా, అనేక తెలుగు–తెలుగేతర సంస్థల్లో సేవలందించి, ఎస్పీబీ, ఏసుదాసు, సిరివెన్నెల వంటి మహానీయులతో సాహిత్య–సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. శంకర నేత్రాలయ యుఎస్సే పాలకమండలి సభ్యుడిగా వేల మంది కంటి శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చి, ‘విద్యాధనం: నయనం ప్రధానం’ వంటి రేడియో కార్యక్రమాలు ఏడు సంవత్సరాలుగా మరియు, “గానసుధ” రేడియోలో పదిహేనేళ్లుగా వ్యాఖ్యాతగావైవిధ్యభరితమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం భారత విద్యాసంస్థల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు అందిస్తున్నారు. ఎలక్ట్రా నిక్ ఇంజనీరింగులో బి.టెక్, ఎం.టెక్, పిహెచ్డి, ఫైనాన్సులో ఎంబీయే, మరియు ఉన్నత విద్యలో ఎంఎస్ పూర్తిచేసి తన ఐదవ పట్టా అందుకొన్నారు. ఈ అంశంపై మీ స్పందన reddyu@gmail.com ద్వారా తెలియజేయగలరు.