తిరుమలలో గోకులాష్టమి వేడుకలు

సెప్టెంబర్ 5న సాయంత్రం 4 గంటలకు ఉట్లోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించనుండగా, యువకులు ఉట్లను కొడుతూ ఉత్సవంలో పాల్గొంటారు.
ఉట్లోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
అదేవిధంగా సెప్టెంబర్ 4న గోగర్భం డ్యామ్ సమీపంలోని ఉద్యానవనంలో శ్రీకృష్ణునికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పంచాభిషేకాలు నిర్వహించి అనంతరం ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








