24223 articles

గుండె నిండా ఉప్పునిముడ్చుకొని అడుగు పొరల్లో నిప్పును ఉంచుకొని నీటి అలల్ని ఎగరేసే సముద్రం భూమిని కోస్తుందని వానల వరదల తనలో కలుపుకుని నదికి పారే గుణం ఇచ్చేది దారి చూపేది భూమేనని, ఎగుడు దిగుడు స్వభావాల్లోంచి ఉన్నతత్వాన్ని ఆస్వాదిస్తూ మానవుల్లో ఉత్తములు ఉంటారని, దీపం ఎప్పుడూ వెలుగు పంచుతుందని పువ్వులెన్నో తావినిస్తాయని, పువ్వుల కింద ముళ్ళు ఉన్నట్లు మనుషుల లోపల వానరులు లోలోపల రాక్షసులు ఉండొచ్చని నిప్పు ఉప్పు కలిసి ఉన్నా కదపకుంటే ప్రశాంతమేనని విడిచిన బాణం గుచ్చుకుని తెలుసుకోలేని తెలివి తొడుగుతో మరిగేది మర యంత్రాలని తెలియని అమాయకత విశ్వ రహస్యంలోని మనిషిదేనని ప్రపంచాన్ని ప్రయోగశాలగా చేసి ప్రళయాలనే సృష్టిస్తున్నారని నిలబడిన కొమ్మ నరుక్కుంటూ చెట్టుని నిందిస్తున్నారని ఇప్పుడు బాగా అర్థమైన నగ్నసత్యం- కొండపల్లి నిహారిణి

చెట్టు మీద ఒక పిట్ట రివ్వున ఎగిరి వెళ్లిన వైపు చూపుల గాలం వేశాను ఓ రెండు కళ్ళు, ఓ రెండు చేతులు ఒక గాయాన్ని మోస్తూ తిరిగి వస్తున్న శశిరాల్ని రాలుస్తున్నవి దాటిపోలేని దుఃఖం, భూ వనరులనూమానవ వనరులనూ ఏకం చేసిన చిచ్చుకు తెర తీసి, విరిసిన మానవత్వానికి తెరవేసి విసిరిన వలలో రెండు శరీరాలతో ప్రదర్శన చేయించడాన్ని చూసి రక్తాశ్రువులు ప్రవహించినవి నిచ్చెన మెట్ల సమాజం నిర్మించలేదేఏ నూతనోత్తేజ శిలా తోరణం శాంతి అగ్ని కీలలపై ఒంటరి నడక అక్కడ బూడిద కుప్పలు గత జీవన దృశ్యం భళ్ళున పగిలిన ఎన్నో రూపుల ప్రతిబింబం అవుతున్నది వివస్త్రను చేసి నడిరోడ్డుపై నడిపిన దుర్మార్గంపుట్టలు మొలిచిన మెదడులకు ప్రతిబింబం అవుతున్నాయి మణిపూర్, కాంగ్పోప్కి జిల్లా ఇంఫాల్‌కు ఓ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం మైథీలు మెజారిటీ ప్రజలు, కుకీ తెగలుకొండ ప్రాంతపు ప్రజలు లోయాలో ఒక లోయ ప్రాంతం వర్గ పోరు హింస ఇద్దరు మహిళలు వార్తా విశేషాలయ్యారు కానీ.. కానీ.. ఆ రోజు ఏమైందంటేదేశం తలవంచిందన్న సత్యాన్ని మొత్తం బొత్తాములతో కట్టలేక, కొన్ని మేధావుల బుర్రలు, సున్నిత మనసులు భరత మాత పాదాలను కన్నీటితో కడుగుతున్నాయి హృదయాలు

మీ నేపథ్యం?ఎప్పటినుండి రాస్తు న్నారు? అచ్చయిన మీ రచనలు? సాహితీ ప్రక్రియల గురించి క్లుప్తంగా చెబుతారా? మా ఊరు చిన్న పెండ్యాల. వరంగల్. మా అమ్మ కౌసల్యాదేవి. నాన్న పెండ్యాల రాఘవరావు. వరంగల్ జిల్లా మొట్ట మొదటి ఎం.పి. సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు. నా భర్త కొండపల్లి వేణుగోపాలరావు. మాకు ఇద్దరు పిల్లలు. మా మామగారు ప్రసిద్ధ చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు. రెండూ గొప్ప చరిత్రలు కలిగిన కుటుంబాల నేపథ్యం నాది. వ్యక్తిగతంగా నేను కవయిత్రిని, రచయిత్రిని. ఎం.ఎ, టి.పి.టి చేసి, 20 ఏళ్లు తెలుగు ఉపాధ్యాయినిగా చేశాను. స్వచ్ఛంద విరమణ అనంతరం ‘ఒద్దిరాజు సోదరుల జీవితం- సాహిత్యం’పై ఉ స్మానియా యూనివర్సిటీలో పి. హెచ్.డి చేసి డాక్టరేట్ తెచ్చుకున్నాను. 198788 నుండి కవిత్వం, వ్యా సాలు రాస్తున్నాను. కానీ పత్రికల్లో నేను ఆలస్యంగా కనిపించాను.4 కవితా సంపుటాలు, 2 కథా సంపుటాలు, 8 సాహిత్య విమర్శ వ్యాస సంపుటాలు, 3 జీవిత చరిత్రలు, ‘అమెరికాలో ఆరు నెలలు’ అనే యాత్రా చరిత్ర, పీహెచ్‌డి గ్రంథం (700పేజీలు) వంటి నా స్వంత పుస్తకాలు 20 ప్రచురించాను. మరో 8 ముద్రణకు సిద్ధంగా ఉన్నవి. 10 పుస్తకాలకు సంపాదకత్వం వహించాను. 2021 న

అమరావతి: లారీని వెనుక నుంచి కారుతో ఢీకొట్టడంతో ఒకరు సజీవదహనమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారి 16పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గండిగుండం పరిధిలోని సత్తరువు చౌరస్తా వద్ద ముందుగా వెళ్తున్న లారీని కారు అదుపుతప్పి ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ కారులో నుంచి బయటకు రాలేక సజీవదహనమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడి వివరాలు వెల్లడిస్తామన్నారు.






మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల క్రాస్ రోడ్డులోని డిపిఆర్ పంక్షన్ హాల్లో బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పొన్నబోయిన రమేష్ కుమార్తె భవానీ - అఖిల్ ల వివాహ వేడుక జరిగింది. వివాహ వేడుకల్లో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ పాల్గొని నూతన వదూ వరులను ఆశీర్వదించారు. బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, బిఆర్ ఎస్ మండల పార్టీ నాయకులు రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, కోణతం యాకూబ్ రెడ్డి, తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేంద్ర నాద్, గజ్జి మల్లేశ్, జంగ శ్రీనివాస్, పానుగుళ్ల విష్ణు మూర్తి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ కొమ్మలపాటి సమర్పణలో హర్ష్ రోషన్ చేస్తున్న నూతన చిత్రం ‘తెల్ల కాగితం’. ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి చిత్రాలతో విజయం సాధించిన హర్ష్ రోషన్ ‘తెల్ల కాగితం’ సినిమాతో రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రానుంది. ‘తెల కాగితం’ అక్టోబర్ 2న ఘనంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని కలిగించేలా ఉంది. ఇందులో హర్ష్ రోషన్, నక్షత్ర జంట ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది. పోస్టర్‌లో చూపించిన ఆ వర్షపు చినుకులు, గొడుగులా అడ్డుగా పెట్టుకున్న అరిటాకు, హీరోహీరోయిన్ల లుక్స్ అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తున్నాయి. ‘సామజవరగమన’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి విజయవంతమైన వినోదాత్మక చిత్రాలకు సహ-రచయితగా గుర్తింపు పొందిన టాలెంటెడ్ రైటర్ నందు సవిరిగాన ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు స్క్రీన్‌ప్లే, సంభాషణలను కూడా రాశారు.



యానాం: చట్టం అందరికీ సమానమే. ఎవరికి చుట్టం కాదు అనే ఈ వార్త ద్వారా తెలుస్తుంది. పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ వయ్యాపురి మణికందన శనివారం తన బైక్‌పై అసెంబ్లీకి వెళ్లారు. హెల్మెట్ లేకపోవడంతో నంబరు ప్లేటు లేని బైక్‌ను డ్రైవ్ చేసుకుంటూ అసెంబ్లీకి వెళ్లడంతో పోలీసులు సదరు ఎంఎల్‌ఎకు రూ.1500 జరిమానా విధించారు. సిఎం కార్యాలయం అధికారులు ఎంఎల్‌ఎలకు మూడు నెలల క్రితం కార్లు ఇచ్చారు కానీ డ్రైవర్లను ఏర్పాటు చేయకపోవడంతో తాను బైక్‌పై అసెంబ్లీకి వచ్చానని మణికందన్ తన బాధను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని నెటిజన్లు ప్రశంసించారు.

అమరావతి: బర్త్ డే వేడుకలకు రమ్మని పిలిచి ఓ మహిళను ఇద్దరు అన్నదమ్ములు హత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో జరిగింది. పోలసీఉలు తెలిపిన వివరాల ప్రకారం..... రాజమహేంద్రవరంలో అరుణ అనే మహిళకు(పేరు మార్చబడంది) భర్తతో విభేదాలు రావడంతో అతడి దూరంగా ఉంటుంది. మట్టాడి దేవి ప్రసాద్ పరిచయం కావడంతో అతడితో సహజీవనం చేస్తోంది. తన తమ్ముడి అరుణతో కలిసి ఉండడం అతడి సోదరుడు ప్రసాద్‌కు ఇష్టం లేదు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగతున్నాయి. దీంతో అరుణను చంపేయాలని అన్నదమ్ములు నిర్ణయం తీసుకున్నారు. గత మంగళవారం అయ్యప్ప పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని అరుణను రమ్మని దేవి ప్రసాద్ కబురు పంపాడు. దీంతో అరుణ ఇంటికి చేరుకున్న తరువాత ఆమె ఫోన్‌లో వీడియోలు చేస్తుండగా ఆమెను వెనక నుంచి ఒకరు చేతులు పట్టుకోగా అయ్యప్ప ఆమె తలపై సుత్తెతో పలుమార్లు కొట్టడంతో ఆమె స్పృహతప్పిపడిపోయింది. చనిపోయిందని అనుకునే ఆమెను స్థానికంగా డంపింగ్ యార్డులో పడేశారు. తెల్లవారుజామున కోన ఊపిరి కొట్టుమిట్టాడుతున్న ఉన్న ఆమెను పారిశుద్ధ్య కార్మికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరు





నవతెలంగాణ – హైదరాబాద్ : అసోంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గువాహటి–సోనాపూర్ జాతీయ రహదారిపై నలగేడెర వద్ద ప్రయాణికులతో ఉన్న మినీ ట్రావెలర్ బస్సు, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెలర్ బస్సు డ్రైవర్ సహా ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. నాగావ్ నుంచి గువాహటికి వెళ్తుండగా వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు […] The post అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సహా ఆరుగురు మృతి appeared first on Navatelangana.