
భారీ వరదల ప్రవాహంలో కొట్టుకుపోతూ ప్రాణ రక్షణ కోసం ఒక వ్యక్తి తాటి చెట్టును ఆసరాగా చేసుకుని, ఐదు రోజుల పాటు ఆహారం, నీరు లేకుండా చెట్టు పైనే గడిపాడు. ఈ సంఘటన ఒడిశాలోని భద్రక్ జిల్లాలో జరిగింది. వరద నీటి ఉధృతి పెరగడంతో బయటపడే మార్గం లేక ఆ వ్యక్తి సమీపంలోని తాటి చెట్టుపైకి ఎక్కారు. చుట్టూ భయంకరమైన ప్రవాహం ఉన్నప్పటికీ ఐదు రోజుల పాటు ధైర్యంతో చెట్టును పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఆపరేషను చేపట్టి ఆయనను సురక్షితంగా కిందకు దింపారు.ఐదు రోజుల పాటు తిండి, నీళ్లు లేకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ వ్యక్తిని వెంటనే ప్రాథమిక చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు








