అతి చిన్న వయసులోనే భారత జట్టులోకి అడగుపెట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం అతడు దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌ జోన్ తరఫున ఆడుతున్నాడు. అంతేకాక ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అదేంటి వైభవ్ జట్టు వైస్ కెప్టెన్ కదా అనే అనుమానం రావొచ్చు. ఇందుకు కారణం లేకుండా పోలేదు. కెప్టెన్ ఇషాన్ కిషన్‌కి గాయం కావడంతో అతడు మైదానం వీడాల్సి వచ్చింది. దంీతో ఆటోమేటిక్‌గా వైస్ కెప్టెన్‌నే కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు.  దీంతో సీనియర్లను ముందుండి నడిపించే అవకాశం వైభవ్‌కు దక్కింది. ఈస్ట్ జోన్‌లో మహ్మద్ షమీతో పాటు ముకేశ్ కుమార్, అభిమన్యు ఈశ్వర్, కుమార్ కుషాంగ్రా, అనుకుల్ రాయ్ వంటి ఆటగాళ్లతో కెప్టెన్‌గా వ్యవహరింస్తున్నాడు.