
తాష్కెంట్: ఉజ్బెకిస్థాన్‌లో రెండ్రోజుల అధికార పర్యటన నిమిత్తం బయలుదేరిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశ రాజధాని తాష్కెంట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవత్క్ మిర్జియోయెవ్ స్వయంగా విమానాశ్రయానిక వచ్చి మోడీకి స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడీ పర్యటన సాగుతోంది.











