
టాలీవుడ్ అగ్ర తార సమంత త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె తన ప్రెగ్నెస్సీని ప్రకటించారు. అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. సోషల్‌మీడియా ద్వారా ఆమె తన అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. చాలాగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించారు. అందులో తనకు పుట్టబోయే పేరు పెట్టడంలో సాయం కావాలని కోరారు. దీంతో అభిమానులు ఎన్నో పేర్లు సూచించారు. ఇందులో ఒక నెటిజన్ చెప్పిన పేర్లకు సమంత ఇచ్చిన ఫన్నీ రిప్లై వైరల్ అవుతోంది.
సమంత, రాజ్ పేర్లు కలిసి వచ్చేలా.. పాప పుడితే ‘సమైరా’ అని, బాబు పుడితే ‘సామ్రా్జ్’ అని పెట్టుకోవాలని ఓ అభిమాని కామెంట్ చేశారు. దీనిపై సమంత స్పందిస్తూ.. ‘‘మన గురించి మనమే మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అనిపించడం లేదూ?’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. సమంత చివరిగా ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా అటు ఫ్యామలీ ఆడియన్స్‌ని, మాస్ ఆడియన్స్‌ని మెప్పించింది. అంతేకాక కలెక్షన్ల పరంగా రూ.100+ వసూళ్లు చేసింది.











