
విశాఖపట్నం: రుషికొండ బీచ్‌లో అతి పెద్ద ప్రమాదం తప్పింది. అలల ఉధృతికి ఏడుగురు పర్యాటకులు గల్లంతు కాగా, వారిని లైఫ్ గార్డ్స్ సిబ్బంది అత్యంత వేగంగా స్పందించి రక్షించారు. దాంతో ఆ ఏడుగురు పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. కొట్టుకుపోతున్న వారిని లైఫ్ గార్డ్స్ సిబ్బంది రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా సాలూరు, చత్తీస్‌గఢ్ నుంచి పర్యాటకులుగా గుర్తించారు.











