
నేను, నా సాహితీయాత్ర: అది 1965.రియా డి జెనేరియోలో పదిహేడేళ్ల పౌలో కరెం టు షాక్ నుంచి మేలుకుని కళ్ళు తెరిచాడు. మానసిక రుగ్మతల ఆస్పత్రిలో బెల్టులతో కట్టేసిన బల్ల మీద మెలుకువ రావడం అతనికి ఇది మూడోసారి. తనలో తను మాట్లాడుకుంటున్నాడనో, ఎవరికి వినబడని మాటలు వినబడుతున్నాయనో, ఉన్మాది అనో అతన్ని ఆ ఆస్పత్రిలో చేర్చలేదు అతని తండ్రులు. రచయిత అవుతానని, చెప్పడంతో మెదడు దెబ్బతిన్నదని ఆందోళనతో మానసిక రుగ్మతల ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. డాక్టర్, ఇంజినీర్, లాయరు కోర్సులు చదివితేనే పిల్లలు జీవితంలో స్థిరపడ గలరని ఆ కాలంలో బ్రెజిల్ మధ్య తరగతి కుటుంబాలు గట్టిగా నమ్మేవి. పౌలో ది మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఇంజనీర్. కొడుకు కూడా ఇంజనీర్ చదవాలని, చదువుతాడని తల్లి తండ్రి అనుకున్నా రు. కానీ పౌలో రచయతనవుతానని పుస్తకాలు రాస్తానని చెప్పేసరికి కొడుకుకి మతి భ్రమించిందని ఆందోళనతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు కరెంటు షాకులు, శక్తిమంతమైన మందులు ఇచ్చి చికిత్స పూర్తి అయ్యిందని ఇంటికి పంపారు.
కానీ ఇంటికి వచ్చాక పౌలో మళ్లీ రాయడం మొదలెట్టాడు, ర చయిత అవ్వాలన్న కోరికనీ మార్చుకోలేదు. మెదడులో నరాలు కదిలేలా కరెంటు షాక్‌లకు గురయ్యాడు. టేబుల్ మీద కట్టి పడేసి ఎంత పెద్ద షాకులు ఇచ్చినా, నిస్త్రాణ చేసే మందు లు మింగించినా, అతని ఆశయం మారలేదు. ఇట్లా మూడు సార్లు కరెంటు షాకులతో, మందులతో మానసిక రుగ్మతల ఆస్పత్రి పాలయ్యాడు. అయినా అతని నిర్ణయం మారలేదు. కరెంటూ షాక్ తీవ్రతను, మందుల శక్తిని వాళ్ళు పెంచుతూ పోయారు. అట్లా మూడు సంవత్సరాలు గడిచా యి. పౌలో ఆశయాన్ని మార్చలేక తల్లిదండులు చేతులెత్తేశా రు. కానీ తల్లితండ్రుల తృప్తి కోసం, రాయడం మానేసి, లాయరు కోర్సు చదవడానికి ఒప్పుకుని ఇరవై ఏళ్లప్పుడు అందులో చేరాడు. ఒక సంవత్సరానికి ఆ చదువు తట్టుకోలేక చదువు మానేసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.
సమాజం కట్టుబాట్లకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రా రంభమయిన హిప్పీ సంస్కృతిలో చేరాడు. హిప్పీవాదులతో కలిసి లాటిన్ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మెక్సికో, యూరోప్ దేశాల్లో తిరిగాడు. 1960వ దశకంలో మాదక ద్రవ్యాలకి కూ డా అలవాటు పడ్డాడు. బ్రెజిల్‌కి తిరిగి వచ్చాక రాక్ మ్యూజిక్ గ్రూపులకి పాటలు రాయడం ప్రారంభించాడు. ఆయన రాసి న కొన్ని పాటలు అప్పట్లో బాగా హిట్ కూడా అయ్యాయి. వా టి వల్ల ఆదాయం కూడా లభించింది. జీవితంలో గెలిచానని, కోరుకున్నది సాధించానని, రచయత కాకూడదని అందరూ పెట్టిన చిత్రవధ నుంచి ఎట్టకేలకి విముక్తి లభించిందని సంతోషించాడు.
కానీ అప్పటికే బ్రెజిల్‌లో అధికారంలో ఉన్న మిలటరీ నియంతృత్వ ప్రభుత్వం, ఆయన్ని 1974లో అరెస్టు చేసింది. ఆయన రాసిన పాటలు, వామపక్షాలతో సాన్నిహిత్యం సంఘ విద్రోహ విధ్వంసక చర్యలుగా పరిగణించి జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ప్రభుత్వానికి అనుకూలంగా మెలిగి నోరెత్తకుం డా ఉండు, లేకపోతే బ్రెజిల్ వదిలి వెళ్ళిపో అని ఆయన్ని హెచ్చరించింది. ఆయన, అస్థిత్వాన్ని, ఆశయాన్ని నాశనం చే యడానికి తల్లిదండ్రులు గురిచేసిన వ్యధ నుంచి బయట పడి న పౌలోకి ప్రభుత్వం నుంచి మళ్ళీ చిత్రహింసలు తప్పలేదు. తల్లిదండ్రులు ఆశించిన దానికి, ప్రభుత్వం ఆజ్ఞాపనకి తేడా లే దు. పద్ధతులు వేరైనా డిమాండ్ మాత్రం మారలేదు.
అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన రాయడం మానలేదు. కాకపోతే, నియంతృత్వ ప్రభుత్వం దృష్టిలో పడకుండా జాగ్రత్తగా మెలగడం అలవర్చుకున్నాడు. 1970 నుంచి 1980 వరకు పౌలో జర్నలిస్టుగా, నాటక రంగంలో దర్శకుడిగా, పాటల రచయితగా పనిచేశాడు దైనందిన ఖర్చులకి, ఇంటి అద్దెకు సరిపడా ఆదాయం లభించేది. 1982లో ఆయన మొదటి పుస్తకం హెల్స్‌ఆర్చివ్స్ అచ్చయింది. దానికి పెద్ద ఆదరణ లభించలేదు. 1986లో ప్రాక్టికల్ మాన్యువల్ ఆఫ్ వాంపైరిజం రాశాడు. కానీ అది ఆయనకి నచ్చలేదు. అది చాలా నాసిరకం రచన అని, దాన్ని పుస్తకాల షాపుల్లోంచి తీసేయించడానికి కూడా ప్రయత్నించాడు. 1986లో 39వ ఏట స్పెయిన్‌లో కమినో డి శాంటియాగో అనే ప్రాచీన తీర్థ యాత్రకి కాలినడకన బయలుదేరాడు. ఆ తీర్థయాత్ర ఆయన జీవితాన్ని మార్చివేసింది.
బ్యాక్ ప్యాక్‌తో గ్రామాల్లోంచి, పల్లె ప్రాంతాల్లోంచి ఒంటరిగా నడుస్తూ, రాత్రిళ్ళు హాస్టళ్లలో బస చేస్తూ సాగిన ఈ యాత్రలో జీవితం గురించి ఆలోచించడం మెదలెట్టాడు. జీవితం అంటే ఉద్యోగాలు, విజయాలు మాత్రమే కాదని ఇంకా ఏదో ఉంద న్న అవగాహన రూపుదిద్దుకోడం ప్రారంభమయ్యింది. నెమ్మది గా తన అస్థిత్వాన్ని తన ఆత్మాన్వేషణని అర్ధం చేసుకున్నాడు. ఈ తీర్థ యాత్ర గురించి తర్వాత ప్రస్తావించినప్పుడు, అది తన ఆధ్యాత్మిక చైతన్యానికి నాంది అని చెప్పాడు. ఆ యాత్ర ముగిశాక ‘ది పిల్గ్రిమేజ్’ నవల రాశాడు. అది1987లో అచ్చయింది.
ఆ తర్వాత 1988లో గొర్రెల కాపరి కుర్రా డి గురించి ఒక చిన్న నవల రాశాడు. ఈజిప్ట్‌లోని పిరమిడ్ల దగ్గర నిధి ఉన్నట్టు శాంటియాగో అనే ఆ కుర్రాడికి పదే పదే కలలు వస్తూ ఉంటాయి. హాయిగా సుఖంగా ఉన్న గొర్రెల కాపరి పని వదిలి కలలో కనిపించిన నిధి కోసం వెళ్ళడం మూర్ఖత్వం అని హెచ్చరిస్తారు. శాంటియాగో ఎవరి మాటలు పట్టించుకోకుండా నిధి వెతుక్కుంటూ వెళతాడు. ఎడారి దాటాక అతనికి ఒక ఆల్కమిస్ట్.. లోహాన్ని బంగారంగా మార్చే విద్య తెలిసిన పసరువేది తటస్థ పడతాడు. ఏదైనా కావాలని మనసారా ప్రగాఢంగా కోరుకుంటే ఈ విశ్వం అది సాధ్యం చేస్తుందని అతని ద్వారా తెలుసు కుంటాడు. అయితే తను కోరుకున్నది పొందాలన్న కోరిక నిజంగా మనస్పూర్తిగా మనలో ఉందని ముందు విశ్వానికి నిరూపించుకోవాల్సి ఉంటుందని శాంటియాగో అర్ధం చేసుకుంటాడు. ఈ గొర్రెల కాపరి కుర్రాడి కధని ది ఆల్కమిస్ట్ అనే చిన్న నవలగా పౌలో తన 41వ ఏట రాశాడు.
దాన్ని 1988లో ఒక చిన్న ప్రచురణ సంస్థ కేవలం 900 కాపీలు ప్రచురించింది. అంతకు మించి ప్రచురించడానికి ఆ సంస్థ అంగీకరించలేదు. పౌలో ఆ తర్వాత రాసిన బ్రీడా నవలని ఒక పెద్ద ప్రచురణ క ర్త అచ్చు వేసినప్పుడు, ది ఆల్మమిస్ట్ కూడా మళ్ళీ ఎక్కువ సం ఖ్యలో అచ్చువేసింది. మొదట్లో 900 కాపీలు మాత్రమే అమ్ము డు పోయినప్పుడు ఆయన నిరుత్సాహపడలేదు. మెదడు సరి గ్గా లేదన్న నెపం మీద మానసిక రుగ్మతల ఆస్పత్రి లో ఇచ్చిన కరెంటు షాకుల్ని, జైల్లో ప్రభుత్వం పెట్టిన చిత్ర హింసల్ని తట్టుకుని నిలబడి తన జీవితాశయాన్ని పూర్తి చేసుకున్న పౌలో ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయనకి తన ఆశయం, తన క ల, ఆత్మన్వేషణ తప్పకుండా ఫలిస్తుందని, ఈ విశ్వం తనని గమనిస్తోందని, తన కల సార్ధకం చేస్తుందని గట్టిగా విశ్వసించాడు.
ది ఆల్మమిస్ట్ నవల తన పాక్షిక స్వీయ చరిత్ర అని, తన ఆధ్యాత్మిక చైతన్యం గురించి వివరిస్తుందని ఆయన పలు సందర్భా ల్లో చెప్పాడు. ఆధ్యాత్మిక ఙ్ఞానం, ఆత్మాన్వేషణ, విధి గురించి కథ రూపంలో చెప్పాడు. ఎడారి, ఆల్కమి.. పసరువేదం.. శకునాలు వంటి విషయాల ద్వారా జీవితం గురించి, జీవితమార్మికత అర్థమయ్యే రీతిలో విశ్లేషించాడు. నవల చదివిన వాళ్ళు ఆత్మాన్వేషణతో పాటు, తమ జీవితాన్ని విశ్లేషించుకోకుండా ఉండలేరు. 1994లో ఫ్రాన్స్‌లో ఒక చిన్న ప్రచురణ కర్త, ది ఆల్కమిస్ట్ ఫ్రెంచ్ భాష అనువాదాన్ని ప్రచురించింది. ఆ దశకంలో అది అత్యధికంగా విక్రయించిన పుస్తకంగా నిలిచింది. ఫ్రెంచ్ భాష అనువాదం వచ్చాక, ఇటలీ, జర్మనీలో ఆయా భాషల్లో ఇది అచ్చయింది.
ఆ సమయంలోనే అమెరికాలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. 1990 దశకం మధ్య నాటికి ది ఆల్కమిస్ట్ ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో అమ్మకాలు సాధించింది. 1994లో హార్పర్ కాలిన్స్ సంస్థ ప్రచురణతో ఈ పుస్తకానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. తర్వాత, అంటే 2000 నాటికి ఒక సాంస్కృతిక అద్భుతంగా రూపాంతరం చెందింది. కాలేజీల్లో ఒక పాఠ్యాంశంగా ప్రవేశించింది. పలు ఉపన్యాసాల్లో చోటు చేసుకుంది. తప్పకుండా చదవాల్సిన పుస్తకంగా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. 1988లో 900 కాపీలతో మొదలయిన ది ఆల్కమిస్ట్, అమ్మకాలు ఇప్పుడు 170 దేశాల్లో, 83 భాషల్లో 15 కోట్లు దాటాయి.
ది అల్కమిస్ట్ కోట్ల మంది ప్రజల మనసుని హత్తుకోడానికి కారణం ఆ పుస్తకం లో ఉన్న కధ! కోట్ల మంది పాఠకులు ఆ కుర్రాడిలో తమని తాము చూసుకున్నారు. పౌలో రాసింది కేవలం ఒక కాల్పనిక కాదు. అది ఆయన స్వీయ అన్వేషణ. తను నమ్మిన విషయం కోసం క్లిష్టమైన ప్రయాణం చేసిన ఆ కుర్రాడే పౌలో! కరెంటు షాకులు, తల్లిదండ్రుల అభ్యంతరా లు, ఎదురైన కష్టాలు, ఆటంకాలు, జైల్లో చిత్రహింసలు ఈ కథకి ఊపిరిపోశాయి. దశాబ్దాల పాటు ఆయన అనుభవించి న మానసిక వ్యధ, కష్టాలే శాంటియాగో నిధి కోసం చేసిన ఎ డారి యాత్ర. ఆయనలో కోట్ల మంది చూసిన నిధిని ఆయన త ల్లిదండ్రులు కనిపెట్టలేకపోయారు. డాక్టర్లు ఆ నిధిని షాకుల తో నాశనం చేయలేకపోయారు. నియంతలు చిత్రహింసలు పె ట్టి చంపలేకపోయారు. ఈ విశ్వం ఆయన్ని దశాబ్దాల పాటు పరీక్షించింది. పదిహేడేళ్ల ప్రాయంలో కరెంటు షాకులతో, ఇరవైఏడేళ్ల వయసులో చిత్రహింసలతో, నలభై ఒకటో ఏట ఆయ న అపురూపంగా భావించిన పుస్తకం కేవలం 900 ప్రతులతో విశ్వం ఆయన్ని పరీక్షించింది. అయినా రచయత నవ్వాలన్న కలని, ఆత్మవిశ్వాసాన్ని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టలేదు.
పౌలోక్వెలో వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. జీవించి ఉ న్న రచయితలందరికన్నా ఆయన రచనలు అత్యధికంగా ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఆయన పుస్తకాలు అ న్ని కలిపి 30 కోట్లకి పైగానే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయాయి. వేరే రచయితలు రాసిన అన్ని పుస్తకాలు చదివిన పా ఠకుల కంటే కేవలం ది ఆల్కమిస్ట్ చదివిన పాఠకుల సంఖ్య ఎక్కువగా ఉంది. మూడుసార్లు మానసిక రుగ్మతల ఆస్పత్రిలో కరెంటు షాకు లు, మందులతో తను పడిన మానసిక వ్యాధిని ఆయన ఎప్పు డూ దాచిపెట్టలేదు. సమయం వచ్చినప్పుడల్లా ఆయన ఆ విషయాల్ని స్వయంగా చెప్పాడు. అయితే ఆ విషయాలు కోపంగా నో, ఆరోపణల లాగానో ఎప్పుడూ చెప్పలేదు. రచయితగా జీవనోపాధి దొరకదని భావించి తన తల్లిదండ్రులు తనని కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నించారని, ఆయన వివరించాడు.
ఆ కాలం సమాజం తీరుని బట్టి తమ కొడుకు జీవితాన్ని సరైన దారిలో పెట్టాలన్న తాపత్రయంతో, భవిష్యత్తులో పరాజయా లు, కష్టాలు, పేదరికం తో బాధ పడకూడదన్న సదుద్దేశం తోనే తనని రాయడం మానిపించాలని ప్రయత్నించారని కూడా చె ప్పాడు. తనమీద ప్రేమతోనే తన భవిష్యత్తు పాడై పోతుందేమో అన్న భయంతోనే మానసిక రుగ్మతల ఆస్పత్రిలో చికిత్స చేయించారని అర్ధం చేసుకుని వాళ్ళని క్షమించాడు. కరెంట్ షాక్‌తో మెదడు సరి చేయాలనుకున్న కుర్రాడు ప్రపంచలోకెల్లా అతి ప్రఖ్యాత రచయితగా నిలిచాడు. కోటిన్నర మం ది హృదయాల్ని తట్టాడు.
పౌలో ఆధ్యాత్మికత విషయానికొస్తే, మనిషికి దై వంతో ఏకమయ్యేఆత్మానందం, ఆత్మజ్ఞానం ముఖ్యం అని భావించాడు. ఈ విషయం ఆయన రచనల్లో కూడా కనబడుతుంది. విశ్వం అణువులు, పరమాణువుల సమూహం కాదని, అనేక కధల సముదాయం అని నమ్మిన వ్యక్తి పౌలో! కాథలిక్ మతస్థుడ్ని అని చెప్పుకున్నా కూ డా సూఫీ, బౌద్ధ, హిందూ సిద్ధాంతాలు, హిం దూ వేదాంతాలు ఆయన్ని చాలా ప్రభావితం చేశాయి. 2009లో ఒక ఇంటర్వ్యూలో సూఫీ సిద్ధాంతాలు, సంప్రదాయాలు తన జాహిర్, ది అల్కమిస్ట్ నవలలకి స్ఫూర్తి అని చెప్పాడు. జీ వాత్మ విశ్వంలో భాగమని, దైవం, విశ్వం వేరు వేరు కాదని తన రచనల్లో వివిధ పద్ధతుల్లో చెప్పాడు. ఆయన రచనలన్నీ భావ గీతం శైలి లోనే సాగుతాయి. తను మనసారా నమ్మిన ఆత్మాన్వేషణ, మార్మిక సిద్ధాంతం ఛాయలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.
ఖలీల్ జిబ్రాన్, రవీంద్రనాథ్ టాగూర్, జిడ్డు కృష్ణమూర్తి, విలియం బ్లేక్, జార్జ్ లూయీబోర్గ్, అలిస్టర్క్రౌలీ తనకి స్పూర్తిదాయులు అని ఆయన వివిధ సందర్భాల్లో వెల్లడించాడు. కల సాధ్యం కావడానికి ఉన్న ఒకే ఒక అడ్డంకి, ఆ కల సాధ్యం కాదేమోనన్న భయం అని నమ్మి మనందరికీ ఆ నిజాన్ని ఆల్కమిస్ట్ ద్వారా చెప్పాడు పౌలోక్వెలో.
ఒక ఆంగ్ల ఆర్కేవ్స్ నుండి తీసుకున్నది.
అనువాదం: సుష్మ దండమూడి

- పౌలోక్వెలో








