
వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంతో పాటు.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. వరుణ్-సత్యల కామెడీ, గాంధీ టేకింగ్ సినిమాను విజయపథంలో నడిపాయి. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఒటిటి సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ సినిమా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి సవాళ్లు ఉంటాయన్నది ఆసక్తికరంగా చూపించారు.











