
హైదరాబాద్: మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పాత వంతెన కూల్చివేసి మరింత ఎత్తులో కొత్త వంతెనను ప్రభుత్వం నిర్మించింది. రూ.52 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 400 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి అంబర్‌పేట-మూసారాంబాగ్ ప్రాంతాలను అనుసంధానిస్తూ, వాహనదారులకు సురక్షితమైన రాకపోకలకు మార్గం సుగమం చేయనుంది. పాదచారుల కోసం 3.5 మీటర్ల ఫుట్‌పాత్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
కాగా, వర్షకాలంలో పాత వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. చాలా ఏళ్లుగా ఉన్న ఈ సమస్యపై దృష్టిపెట్టిన ప్రభుత్వం కొత్త వంతెనను నిర్మించింది. దీంతో మూసీ వరద మూసీ వరదల సమయంలోనూ రాకపోకలకు అంతరాయం కలగకుండా నిర్మించిన ఈ హైలెవల్ బ్రిడ్జితో 365 రోజులూ మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.











