కింగ్ నాగార్జున మైల్‌స్టోన్ 100వ చిత్రం ‘కింగ్ 100’. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా పవర్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నాగార్జున వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యే గ్లింప్స్‌లో సమాజం మనుషులను వారి సంపద ఆధారంగా ఎలా విభజిస్తుందనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రస్తావించారు. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనను ‘లూజర్’ అని పిలిచారని, అదే సంపద సంపాదించిన తర్వాత ‘ది కింగ్’ అని పిలుస్తున్నారని

నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మరోవైపు నాగార్జున ఫొటోతో పాటు రూ.50,000 కోట్ల భారీ స్కామ్‌కు సంబంధించిన వార్తను చూపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. నాగార్జున మైల్‌స్టోన్ 100వ సినిమాకు ‘కింగ్ 100’ అనే టైటిల్ పర్ఫెక్ట్‌గా ఉంది. నాగార్జునను అత్యంత స్టైలిష్, డైనమిక్ అవతార్‌లో చూపించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ప్రభావాన్ని మరింత పెంచింది. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కింగ్ 100’ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.