కైరో: కదులుతున్న ట్రక్కు నుంచి 105 కిలోల చికెన్‌ని ఓ దొంగల ముఠా చోరీ చేసింది. సినిమాల్లో లాగా ట్రక్కు రన్నింగ్‌లో ఉండగానే చోరీ చేశారు. ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. చోరీ జరుగుతుండగా మరో వాహదారుడు వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ ఫ్యాక్టరీ నుంచి సుమారు నాలుగు టన్నుల ఫ్రీజ్ చేసిన చికెట్‌ తరలిస్తున్న ట్రక్కును ఈ ముఠా టార్గెట్ చేసింది. కారు వెనకే వెళ్లిన దుండగులు అనుమానం రాకుండా ట్రక్కుపైకి ఎక్క వెనుకవైపు ఉన్న డోర్ తెరిచారు. అనంతరం కదులుతున్న వాహనాల నుంచి చికెన్ డబ్బలను చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీన్ని మరో వ్యక్తి వీడియో తీయగా.. అది చూసిన డ్రైర్ అసలు చోరీ జరిగినట్లు తనకు తెలియదని అన్నాడు. మొత్తంగా తన ట్రక్కు నుంచి 105 కిలోల చికెన్‌ను ఎత్తుకెళ్లినట్లు డ్రైవర్ చెప్పాడు. వీడియో ఆధారంగా కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆరుగురు అనుమానితులను గుర్తించారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులు మరణించగా.. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.