
గండిపేట భూకబ్జా కేసులో వైసిపి మాజీ ఎంఎల్‌ఎ బొల్లా బ్రహ్మనాయుడుకు షరతులతో కూడిన బెయిల్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు మంజూరు చేసింది. 15 రోజులకు ఒకసారి పోలీసుస్టేషన్‌కు హాజరు కావాలని, రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని బ్రహ్మనాయుడును కోర్టు ఆదేశించింది. గండిపేటలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ పత్రాలు, నకిలీ ప్రభుత్వ జీవోలు సృష్టించిన కేసులో బొల్లా బ్రహ్మనాయు డిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నారు. ఈ భూమిని కోర్టు తమకే కేటాయించినట్లు తప్పు డు రెవెన్యూ రికార్డులు సృష్టించి,
సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారు. ఆ భూమిని కొనుగోలు చేసేందుకు మాజీ ఎంఎల్‌ఎ బ్రహ్మనాయు డు, అతని సోదరుడు రమేష్‌లతో నిందితులు ఒప్పందం చేసు కున్నారు. దీనిపై గండిపేట తహసీల్దార్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 23న నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమో దైంది. ఈ కుట్రలో బ్రహ్మనాయుడు సహా ఇప్పటికే నిమ్మల రాజేశ్, వేణుగోపాల్, సాయి కిరణ్, రాధాకృష్ణ, ప్రవీణ్ కుమార్ అనే ఐదుగురు నిందితు లను పోలీసులు అరెస్ట్ చేశారు.









