
కొద్ది రోజుల క్రితం షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్ రష్మిక.. తిరిగి గాయం నుంచి కోలుకున్నారు. తిరిగి ఆమె సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. ‘తిరిగి షూట్‌కు వెళ్తున్నా.. కానీ, ఈ క్షణాలను మాత్రం కచ్చితంగా మిస్ అవుతాను’ అని వరలక్ష్మి వ్రతం చేస్తోన్న ఫొటోలతో పాటు.. ఇతర ఫొటోలను పంచుకున్నారు. ఎట్టకేలకు రష్మిక తిరిగి సెట్స్‌లోకి వెళ్లడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘క్వీన్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా తుంటి భాగంలో బలమైన గాయమైంది. దీంతో ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో రష్మిక ఇంట్లోనే ఉంటూ తరచూ తన హెల్త్ అప్‌డేట్‌లతో పాటు, తాను చేస్తున్న పనులను అభిమానులతో పంచుకుంటూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు.











