
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించారు నమిత. అయితే ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తక్కువ అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నమిత. కెరీర్ ఆరంభంలో వరుస సినిమాలతో తనకొచ్చిన పేరు, ప్రఖ్యాతుల కారణంగా అహంకారం తలకెక్కి నష్టపోయినట్లు అభిప్రాయపడ్డారు. వరుస విజయాలు, మీడియా ఇచ్చిన ప్రాధాన్యం కారణంగా తన ప్రవర్తన అసాధారణంగా ఉండేదన్నారు.
‘‘నటిగా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో నాలో గర్వం ఉండేది. ఎవరినీ లెక్క చేసేదాన్ని కాదు. ఈ విషయమై చాలా మంది నన్ను హెచ్చరించారు. ‘నువ్వు ఇలాంటి వైఖరే అనుసరిస్తే, ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగలేదు’ అన్నారు. దీంతో నెమ్మదిగా నాలో మార్పు మొదలైంది. నా ప్రవర్తన కారణంగా సహనటులు, టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్ట్‌లు చాలా ఇబ్బంది పడ్డారట. ఒకరిద్దరు కాదు, చాలా మంది ఈ విషయాన్ని నాకు చెప్పారు’’ అని నమిత చెప్పుకొచ్చారు.











