తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. తమిళ నటుడు, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ కీలక పాత్రలో మోహన్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న తెలుగు సిరీస్ ‘పంచనామా’. ఉదయ భాను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మిద్దె విజయేంద్ర మౌళి, ఉదయభాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి జీ5 వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ఆద్యంతం థ్రిల్ పంచేలా దీన్నొక క్రైమ్ మిస్టరీ థ్రిలర్‌గా తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు చనిపోవడం వెనుక కారణం ఏంటి? దాన్ని పోలీస్ ఆఫీసర్ భరత్ ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. శివాజీ రాజా, మేథా రెడ్డి, చరణ్ బాబు, రూప లక్ష్మి, రాథికా ప్రీతి, సూర్య, శ్రీజ, మోహన్ వ్రీవాత్సవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.