🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3911 వార్తలు

మల్లారం విద్యుత్ సమస్యకు పరిష్కారం
పాత వార్త
తెలంగాణ

మల్లారం విద్యుత్ సమస్యకు పరిష్కారం

రూ. 25 లక్షల నిధులు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబుమంత్రి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకుల పాలభిషేకంనవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని మల్లారం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామస్తుల, రైతుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. గ్రామానికి, వ్యవసాయ రంగానికి ఒకే విద్యుత్ లైన్ ఉండటంతో ఇన్నాళ్లూ ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చొరవతో తెరపడనుంది. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో […] The post మల్లారం విద్యుత్ సమస్యకు పరిష్కారం appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 28, 2026 - మంగళవారం👁 6
తల్లిగా నా పెంపకంపై మచ్చ పడకూడదు.. అకీరా, ఆద్యలకు రేణు దేశాయ్ ఎమోషనల్ కండిషన్!
పాత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
పాత
తెలంగాణ

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డిఆర్ఐ అధికారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకుని, వారి వద్ద నుండి 11.4 కేజీల యాంఫేటమైన్ (Amphetamine) స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.11.4 కోట్లు ఉంటుందని అంచనా. బ్లాక్ కవర్లుల్లో, డిజైనర్ పేపర్‌తో కప్పి, బెడ్‌షీట్‌ల మడతల్లో దాచి మహిళలు స్మగ్లింగ్ చేస్తున్నారు.ఇద్దరు మహిళ నిందితులను డిఆరఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Rohit Sharma: ముంబై ఇండియన్స్కి గుడ్ న్యూస్.. జట్టులోకి రోహిత్ రీఎంట్రీకి లైన్ క్లియర్
పాత
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ధాన్యం లారీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు
పాత
తెలంగాణ

మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ధాన్యం లారీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు

మెదక్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొల్చారం దగ్గర వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసి సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి, ధాన్యం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ఘటనలో దాదాపు ౩౦ మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్టీసి బస్సు.. హైదరాబాద్ నుండి మెదక్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

బ్యాంకాక్ టూ హైదరాబాద్.. శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో రూ. 2 కోట్ల డ్రగ్స్ సీజ్
పాత
డీజిల్ కొరతతో వ్యవసాయ రంగం దెబ్బ తింటుంది
పాత
తెలంగాణ

డీజిల్ కొరతతో వ్యవసాయ రంగం దెబ్బ తింటుంది

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు నవతెలంగాణ – పరకాల జిల్లాలో నెలకొన్న డీజిల్ కొరత వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు డిమాండ్ చేశారు. ప్రస్తుత సాగు సీజన్‌లో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అత్యవసరమని, అయితే బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో సాగు పనులు […] The post డీజిల్ కొరతతో వ్యవసాయ రంగం దెబ్బ తింటుంది appeared first on Navatelangana.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రేవూరి
పాత
తెలంగాణ

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రేవూరి

పరకాలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంనవతెలంగాణ – పరకాల రైతులు తాము పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం […] The post రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రేవూరి appeared first on Navatelangana.

దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీం దోలా భారత్‌కు అప్పగింత
పాత
తెలంగాణ

దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీం దోలా భారత్‌కు అప్పగింత

భారత భద్రతా, నిఘా సంస్థలకు కీలక విజయంగా భావిస్తున్న పరిణామంలో అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు చెందిన ప్రముఖ సభ్యుడు, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడు అయిన సలీం దోలాను భారత్‌కు అప్పగించారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఇటీవల భారత, అంతర్జాతీయ నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సలీం దోలా పట్టుబడ్డాడు. అనంతరం ప్రత్యేక విమానంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ఉదయం ఢిల్లీలోని టెక్నికల్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు.అధికారుల సమాచారం ప్రకారం, అంతర్జాతీయ స్థాయిలో సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నిర్వహించడంలో దోలా కీలక పాత్ర పోషించాడు. అతడు నడిపిన మాదకద్రవ్యాల సామ్రాజ్య విలువ రూ.5,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దావూద్ ఇబ్రహీం ఆధ్వర్యంలోని డీ -కంపెనీకి చెందిన అంతర్జాతీయ డ్రగ్ పంపిణీ వ్యవస్థను ఛేదించే దిశగా ఈ అప్పగింత కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు.ఈ నెట్‌వర్క్ చాలాకాలంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ), ముంబై పోలీసుల నిఘాలో ఉన్నట్లు తెలుస్తోంది.దేశ రాజధానికి చేరుకున్న వెంటనే సలీం దోలాను నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని రహస్య

ఔటర్ రింగ్ రోడ్డు రైలింగ్ ఢీకొట్టిన కారు..ఒకరు మృతి
పాత
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం... మెకానిక్ షెడ్డులో మంటలు... రెండు కార్లు పూర్తిగా దగ్ధం...
పాత
శంషాబాద్ టు ముంబై, బెంగళూరు, అమరావతికి బుల్లెట్ ట్రైన్ : సీఎం రేవంత్
పాత
భర్తను హనీమూన్ తీసుకెళ్లి చంపిన భార్య సోనమ్‎కు బెయిల్
పాత
రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
పాత
తెలంగాణ

రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

నవతెలంగాణ-రాయికల్రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జరిగింది. తెలంగాణ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల నియమావళి-2020 ప్రకారం నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్ల ద్వారా ఈ ఎన్నిక చేపట్టారు.మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఇద్దరు సభ్యులుగా వల్లకొండ మహేష్, మహిళా సభ్యురాలిగా సుదవేని లత ఎన్నికయ్యారు. మైనారిటీ వర్గానికి చెందిన సభ్యులుగా ఇర్ఫాన్ అలీ, మహిళా సభ్యురాలిగా ఎం.డి. ఇంత్యాజ్ పర్వీన్ ఎన్నికయ్యారు.ఎన్నిక అనంతరం కో-ఆప్షన్ […] The post రాయికల్ పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక appeared first on Navatelangana.

ఒడ్డేలింగాపూర్ అంగన్వాడిలో పోషణ పక్వాడ్
పాత
తెలంగాణ

ఒడ్డేలింగాపూర్ అంగన్వాడిలో పోషణ పక్వాడ్

నవతెలంగాణ-రాయికల్మండలంలోని ఒడ్డేలింగాపూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసం,గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించగా.. గర్భిణీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం కార్యక్రమం చేపట్టారు. పోషణ, ఆరోగ్యంపై వైద్యాధికారి సతీష్ అవగాహన కల్పిస్తూ తల్లులు, గ్రామస్థులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎన్. మానస,ఉపసర్పంచ్ శంకర్, అంగన్వాడి టీచర్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. The post ఒడ్డేలింగాపూర్ అంగన్వాడిలో పోషణ పక్వాడ్  appeared first on Navatelangana.

ఆలూరులో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి సర్వే
పాత
తెలంగాణ

ఆలూరులో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి సర్వే

నవతెలంగాణ-రాయికల్మండలంలోని ఆలూరు గ్రామపంచాయతీని జాతీయ గ్రామీణాభివృద్ధి,పంచాయతీరాజ్ సంస్థ ప్రతినిధి సుధాకర్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సభల్లో ప్రజల పాల్గొనింపు స్థాయి, గ్రామపంచాయతీ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర సర్వే నిర్వహించారు. గ్రామస్థుల అభిప్రాయాలను సేకరిస్తూ.. గ్రామ సభల నిర్వహణలో ఉన్న లోపాలు, వాటి మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అలాగే పలు సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.సేకరించిన వివరాల ఆధారంగా సమగ్ర నివేదికను జాతీయ స్థాయి ప్రభుత్వ శాఖకు […] The post ఆలూరులో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధి సర్వే appeared first on Navatelangana.

అమృత్ పనులు వేగవంతం చేయాలి.. కౌన్సిలర్ల డిమాండ్
పాత
తెలంగాణ

అమృత్ పనులు వేగవంతం చేయాలి.. కౌన్సిలర్ల డిమాండ్

నవతెలంగాణ-రాయికల్రాయికల్ పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం పురపాలక కార్యాలయంలో చైర్మన్ కట్కం రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో పట్టణ పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యలు,అమృత్ 2.0 పథకం అమలు తదితర అంశాలపై చర్చించారు.పట్టణంలోని అన్ని వార్డుల్లో అమృత్ నీటి సరఫరా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని,సీసీ రోడ్ల మరమ్మత్తులు, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సభ్యులు సూచించారు.మొత్తం 25 అంశాలకు గాను 25 అంశాలు ఏకగ్రీవంగా ఆమోదం పొందగా,టేబుల్ ఎజెండాలో ప్రతిపాదించిన అంశాల్లో 2 […] The post అమృత్ పనులు వేగవంతం చేయాలి.. కౌన్సిలర్ల డిమాండ్ appeared first on Navatelangana.

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్.. పంజాబ్దే ఫస్ట్ బ్యాటింగ్
పాత
పెళ్లికి ముందే గర్భం దాల్చా.. అందుకే  అర్జంటుగా పెళ్లి చేసుకున్నాం.. ప్రెగ్నెన్సీపై నోరు విప్పిన బాలీవుడ్ నటి!
పాత
ప్రజారోగ్యమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం: జిల్లా ప్రోగ్రాం అధికారి డా.ప్రసిద్ద్
పాత
తెలంగాణ

ప్రజారోగ్యమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం: జిల్లా ప్రోగ్రాం అధికారి డా.ప్రసిద్ద్

నవతెలంగాణ-తుంగతుర్తిప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలేనని.. ప్రజారోగ్యమే ప్రథమ లక్ష్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పని చేయాలని(ఎన్సివిబిడిసి) జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసిద్ద్  అన్నారు.మంగళవారం ప్రజాపాలనా.. ప్రగతి ప్రణాళికలో భాగంగా రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని,తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి మాట్లాడారు.ఈ మేరకు అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ అమలుపై సమీక్ష నిర్వహించి,జాతీయ కీటక జనిత వ్యాధులపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. తుంగతుర్తి మండల పరిధిలోని,వసతి గృహాలలో దోమల నివారణ కోసం ఏం […] The post ప్రజారోగ్యమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం: జిల్లా ప్రోగ్రాం అధికారి డా.ప్రసిద్ద్ appeared first on Navatelangana.

నత్తనడకన ధాన్యం కొనుగోలు ప్రక్రియ.. భయం గుప్పిట్లో అన్నదాతలు
పాత
తెలంగాణ

నత్తనడకన ధాన్యం కొనుగోలు ప్రక్రియ.. భయం గుప్పిట్లో అన్నదాతలు

నవతెలంగాణ-తుంగతుర్తితుంగతుర్తి డివిజన్ పరిధిలో ఈ యాసంగిలో 98 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ ఏడాది గతానికి భిన్నంగా వరి పంటలకు చీడ పీడల దాడి ఎక్కువగా ఉండడంతో తాము వేసిన పంటను రక్షించుకునేందుకు రైతన్న నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎన్నో కష్ట నష్టాలకోర్చి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చిన రైతన్నకు అక్కడ భంగపాటు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన తరువాత తాము పడుతున్న కష్టాలు అన్నీ […] The post నత్తనడకన ధాన్యం కొనుగోలు ప్రక్రియ.. భయం గుప్పిట్లో అన్నదాతలు appeared first on Navatelangana.

కొనుగోలు కేంద్రాలకు లారీలను కేటాయించాలి: సర్పంచ్
పాత
తెలంగాణ

కొనుగోలు కేంద్రాలకు లారీలను కేటాయించాలి: సర్పంచ్

నవతెలంగాణ-తుంగతుర్తితెలంగాణలో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అన్నారు. గతానికి భిన్నంగా లారీల కేటాయింపు, ఆన్లైన్ సిస్టం ద్వారా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి సెంటర్కు నాలుగు నుండి ఐదు లారీలు కేటాయించాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు మనోధైర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. The post కొనుగోలు కేంద్రాలకు లారీలను కేటాయించాలి: సర్పంచ్ appeared first on Navatelangana.

IPL 2026: పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్..
పాత
తెలంగాణ

IPL 2026: పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్..

ఐపిఎల్ 2026లో మరో రసవత్తర పోరు జరగనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుని, పంజాబ్ జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది.ఇప్పటివరకు అపజయమే లేకుండా పంజాబ్ కింగ్స్ దూసుకుపోతోంది. ప్రస్తుతం టేబుల్ టాపర్ గా ఉన్న పంజాబ్.. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడించి తమ జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు, ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో ఐదింట్లో గెలిచిన రాజస్థాన్ జట్టు.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించి తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంది.

20 రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
పాత
తెలంగాణ

20 రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఈవెంట్ నిర్వాహణ కోసం పర్యాటకశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్య, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న పోస్టుల భర్తీపై మంత్రి సమావేశంలో చర్చించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో భర్తీ చేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అలాగే ఫార్మసిస్ట్ పోస్టులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఎంపిహెచ్‌ఎ ఫిమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. వచ్చే నెల 15వ తేదీ నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. ఫార్మసిస్ట్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెలకొన్న న్యాయపరమైన చిక్కులను

Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)