🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)
Todayతెలంగాణ

తెలంగాణ

3652 వార్తలు

ఎస్‌ఆర్‌హెచ్‌లో కీలక మార్పు.. జట్టులోకి ప్రపంచకప్ విన్నర్
పాత వార్త
తెలంగాణ

ఎస్‌ఆర్‌హెచ్‌లో కీలక మార్పు.. జట్టులోకి ప్రపంచకప్ విన్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా శివమ్ మావి లీగ్ నుంచి దూరమైన విషయం తెలిసిందే. గత మినీ వేలంలో మావిని రూ.75 లక్షలకు ఎస్ఆర్‌హెచ్ దక్కించుకుంది. అయితే అతడు గజ్జల్లో గాయం కారణంగా లీగ్‌కి దూరమయ్యాడు. ఇప్పుడు అతడి స్థానాన్ని యువ ప్లేయర్ ఆర్ఎస్ అంబరీష్‌తో భర్తీ చేసింది. అంబరీష్ మీడియం పేస్ ఆల్ రౌండర్. అండర్-19 వరల్డ్ కప్-2026 విన్నింగ్ జట్టులో అతడు సభ్యుడు. ఈ టోర్నీలో 11 వికెట్లు తీసి సత్తా చాటాడు. భారత్ తరఫున రెండో అత్యధిక వికెట్ టేకింగ్ బౌలర్. ఈ 18 ఏళ్ల కుర్రాడు కుడిచేతితో బౌలింగ్ చేస్తాడు. ఎడమ చేతి వాటంతో బ్యాటింగ్ చేయడం గమనార్హం. తమిళనాడుకు చెందిన అంబరీష్‌కు ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రఫుల్ హింగే, సకిబ్ వంటి కుర్రాళ్లకు సన్‌రైజర్స్ ఛాన్స్ ఇచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ మూడో స్థానంలో ఉంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 6 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇంకా ఐదు మ్యాచులు ఆడాల్సి ఉంది. మే 3వ తేదీన ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.🚨 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋 𝐀𝐍𝐍𝐎𝐔𝐍�

Admin5 రోజుల క్రితం👁 2
రైతు హామీల అమల్లో ప్రభుత్వం ఘోర వైఫల్యం:బండి సంజయ్
పాత
తెలంగాణ

రైతు హామీల అమల్లో ప్రభుత్వం ఘోర వైఫల్యం:బండి సంజయ్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమల్లో ఘోర వైపల్యం చెందిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రబీ సీజన్‌లో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని, తాలు, తరుగు, తేమ పేరు చెప్పి దోచుకుంటున్న దళారుల నుండి రైతును ఆదుకుని ప్రతి గింజను ఎమ్మెస్పీ ధరకు కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సైతం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంవల్ల ఆ పథకం ద్వారా తెలంగాణ రైతులు ప్రయోజనం అందుకోలేకపోతుండటం బాధాకరమని తెలిపారు. ముఖ్యంగా వడ్లు, మొక్కజొన్న, శనగ కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.మండుతున్న ఎండలు, వడగాడ్పులు, అకాల వర్షాలతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు, మక్కజొన్న,శనగలు, పొద్దుతిరుగుడుసహా రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి నానా ప

హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖా గోయల్ బాధ్యతల స్వీకరణ
పాత
తెలంగాణ

హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖా గోయల్ బాధ్యతల స్వీకరణ

సీనియర్ ఐపిఎస్ అధికారిణి శిఖా గోయల్ శుక్రవారం రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో ఆమె సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను కొనసాగించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ సంబంధిత శాఖాధిపతులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ హోం శాఖ పరిధిలోని పోలీస్, జైళ్లు, అగ్నిమాపక సేవలు, ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ వంటి వివిధ సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఫోరెన్సిక్ సైన్స్ రంగాల్లో విశేష అనుభవం ఉన్న శిఖా గోయల్ నియామకం హోం శాఖలో సాంకేతిక ఆధారిత పరిపాలనకు దోహదపడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఫ్యాన్స్‌కి ఎట్టకేలకు శుభవార్త.. ‘పెద్ది’ రిలీజ్‌ డేట్ ఫిక్స్
పాత
తెలంగాణ

ఫ్యాన్స్‌కి ఎట్టకేలకు శుభవార్త.. ‘పెద్ది’ రిలీజ్‌ డేట్ ఫిక్స్

హైదరాబాద్: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. కాగా, తాజాగా సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా జూన్ 4న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందులు వేసింది. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఎఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దీంతో ఇక సినిమాకు సంబంధించిన మిగితా పనులు పూర్తి చేసుకొని పెద్ది రిలీజ్‌కి రెడీ అవుతోంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Meet #PEDDI on June 4th ❤️‍🔥See you in Cinemas. pic.twitter.com/axzrkheBIe— Ram Charan (@AlwaysRamCharan) May 1, 2026

ఉస్మానియా వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
పాత
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
పాత
తెలంగాణ

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టేబుల్ టాపర్లు పంజాబ్ కింగ్స్‌ని ఓడించి మంచి జోష్‌లో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఆశపడుతోంది. మరోవైపు వరుసగా ఓటముల పాలవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఈ మ్యాచ్‌లో విజయం కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. ఢిల్లీ మూడు మార్పులు చేసింది. తుది జట్లు: ఆర్ఆర్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డొనొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాండ్రే బర్గర్, బ్రిజేశ్ శర్మ. డిసి: కెఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, కైలీ జెమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్.

దేశంలోనే జీఎస్టీ వృద్ధిలో తెలంగాణ రెండో స్థానం
పాత
తెలంగాణ

దేశంలోనే జీఎస్టీ వృద్ధిలో తెలంగాణ రెండో స్థానం

దేశంలోనే జీఎస్టీ వృద్ధిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కర్ణాటక నిలిచింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జీఎస్టీ రాబడి వసూళ్లు గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో 35 శాతం అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో అధిక పనితీరును వాణిజ్య పన్నుల శాఖ నమోదు చేసింది. ఏప్రిల్ 2025లో రూ.3,433 కోట్ల జీఎస్టీ రాబడి రాగా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జీఎస్టీ రాబడి రూ.4,621 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది కన్నా ఈ సంవత్సరం రూ.1,188 కోట్ల రాబడి వాణిజ్య పన్నుల శాఖకు అధికంగా వచ్చింది. దీంతో ఈ సంవత్సరం ఈ శాఖ 35 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఏప్రిల్‌లో వచ్చిన రూ.4,621 కోట్ల జీఎస్టీ ఆదాయం, జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికంగా వచ్చిన రాబడిగా నమోదు కావడం విశేషం. మార్చి 2026 నెలలో వాణిజ్య పన్నుల శాఖకు రూ.4,231 కోట్ల రాబడి రాగా, ఏప్రిల్‌లో అది మరింత పెరగడం విశేషం. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం నాలుగు నెలలుగా నిరంతరం రూ.4 వేల కోట్లకు పైగా నమోదవుతోంది, జనవరి 2026 నుంచి వాణిజ్య పన్నుల శాఖ రాబడిని అధిగమిస్తూ వస్తోంది. ఈ నాలుగు నెలల్లో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వసూలయిన మొత్తం ఆదాయంలో పెట్రోల్

Peddi Release Official : టాక్సిక్ తప్పుకుంది.. పెద్ది వచ్చేస్తోంది.. జూన్ 4న గ్లోబల్ స్టార్ బాక్సాఫీస్ వేట!
పాత
పంజాబ్ అసెంబ్లీలో రచ్చ.. సిఎం తాగి వచ్చారని..
పాత
తెలంగాణ

పంజాబ్ అసెంబ్లీలో రచ్చ.. సిఎం తాగి వచ్చారని..

మే డే సందర్భంగా పంజాబ్‌‌లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సమావేశాల్లో రచ్చ జరిగింది. పంజాబ్ సిఎం భగవంత్ మాన్ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ పలు మార్లు తడబడ్డారని అన్నారు. సభ్యులందరికీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించాలని స్పీకర్‌ను కోరారు. సిఎం ప్రజల సమక్షంలో డోప్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డోప్ పరీక్ష డిమాండ్‌ను స్పీకర్ తిరస్కరించారు. ప్రతిపక్షాల నిరసనలతో సిఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ సమావేశం కార్మిక దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని.. దయచేసి సభ్యులంతా సభా మర్యాద పాటించాలని కోరారు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం
పాత
తెలంగాణ

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గత నాలుగేళ్లుగా ఇంధన రిటైల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, చమురు కంపెనీలకు భారీ నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 126 డాలర్ల వరకు చేరి నాలుగేళ్ల గరిష్ఠ స్థాయిని తాకాయి. అనంతరం కొంత తగ్గినా, ధరలు ఇంకా 110 డాలర్లకు పైగానే కొనసాగుతున్నాయి. హార్మూజ్ జలసంధి మార్గంలో నౌకాయాన రాకపోకలు పరిమితమవడం, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.ఇదిలా ఉండగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పరిశ్రమ తరఫున ప్రకటన విడుదల చేస్తూ, అంతర్జాతీయ ఇంధన వ్యయాలు పెరిగినా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ ధరలను పెంచడం లేదని తెలిపింది. అయితే వాణిజ్య ఎల్పీజీ, పారిశ్రామిక డీజిల్, 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లు, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు సరఫరా చేసే జెట్ ఇంధన ధరలను మాత్రం పెంచినట్లు వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ

కమర్షియల్ గ్యాస్ ధరల పెంపుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
పాత
తెలంగాణ

కమర్షియల్ గ్యాస్ ధరల పెంపుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా పెంచడంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం సామాన్యుడి నడ్డీ విరిచేలా ఉందని ఆయన మండిపడ్డారు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరను ఏకంగా 993 రూపాయలు పెంచడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఒక్కసారిగా 30 నుంచి 35 శాతం ధర పెంచడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఈ పెంపు వల్ల హోటళ్లు, కేప్‌లు, రెస్టారెంట్‌లతో పాటు రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులపై కోలుకోలేని దెబ్బ పడుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఃపశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన 24 గంటల్లోపే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మంత్రి తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ ప్రజలను మోసం చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడం అంటే పరోక్షంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమేనని, దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయని మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సిలిండర్ రేటు మూడు వేలకు పైగా చేరుకుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలను ఉపసంహరించుకో వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశార

పార్టీలకు ఊహించని షాక్ : పశ్చిమ బెంగాల్ లో రేపు 15 పోలింగ్ బూతుల్లో రీ పోలింగ్
పాత
అలహాబాద్ హైకోర్టులో రాహుల్ గాంధీ బిగ్ రిలీఫ్.. ఏ కేసులో అంటే..?
పాత
గుడ్ న్యూస్.. ఇక నేరుగా రైతు నుంచే  సేంద్రీయ ఉత్పత్తులు కొనొచ్చు..మే 4 న TG ఆర్గానిక్స్ యాప్ ప్రారంభం
పాత
ఒఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
పాత
రోజంతా ఏసీ రూంలో  ఉంటున్నారా..? అయితే ఈ నిజాలు, సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి!
పాత
IPL 2026: SRH నుంచి‎ శివం మావి ఔట్.. హైదరాబాద్ జట్టులోకి అండర్ 19 వరల్డ్ కప్ హీరో
పాత
మా ఆవిడను తీసుకొచ్చా జరగండి..మీరంతా ఏంటి ఇక్కడ?..  బెల్లంకొండ శ్రీనివాస్ వీడియో వైరల్!
పాత
చిన్నారి లాలీపాప్.. పెద్ద దోపిడీనే ఆపింది.. నాన్నను కాపాడింది : మానవత్వానికి ఉన్న పవర్ అలాంటిది..!
పాత
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఒక మెగా స్కామ్: రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్
పాత
మే నెల వాతావరణం : రుతు పవనాల గుడ్ న్యూస్.. అంతలోనే ఎల్ నినో భయం.. బీభత్సమైన ఎండలు..!
పాత
హ్యామ్ రోడ్ల స్కామ్ పై టెండర్లు తెరవకముందే ఎలా చెబుతారు : హరీష్ రావు
పాత
తెలంగాణ

హ్యామ్ రోడ్ల స్కామ్ పై టెండర్లు తెరవకముందే ఎలా చెబుతారు : హరీష్ రావు

హైదరాబాద్: హ్యామ్ రోడ్ల స్కామ్ ను అసెంబ్లీలో బయటపెట్టామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిజమైందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టెండర్లు తెరవకముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. టెండర్లు తెరిచారని..సగటున 25 శాతం ఎక్సెస్ వెళ్లాయని, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి శాఖల్లో టెండర్లు ఎక్సెస్ వెళ్లాయని తెలియజేశారు. ఆర్ అండ్ బి కంటే పిఆర్ లో రెండు శాతం ఎక్కువ ఉందని, ఒక టెండర్ ఏకంగా 75 శాతం ఎక్సెస్ వేశారని అన్నారు. ఆర్ అండ్ బి లో రూ.11 వేల కోట్లతో టెండర్ పిలిస్తే రూ. 15 వేల కోట్లు అవుతుందని, పిఆర్ లో రూ. 6 వేల కోట్లతో టెండర్ పిలిస్తే దాదాపు రూ. 8 వేల కోట్లు అవుతుందని అన్నారు. రెండు శాఖలో కలిపి రాష్ట్ర ఖజానాకు రూ. 5 వేల కోట్ల అదనపు భారం పడుతుందని, హైవేలకు టెండర్లు పిలిస్తే 25 శాతం తక్కువ.. హ్యామ్ రోడ్లలో 25 శాతం ఎక్కువ అవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.

గుజరాత్‌పై అదరగొట్టిన భువీ.. చరిత్ర సృస్టించాడు..
పాత
తెలంగాణ

గుజరాత్‌పై అదరగొట్టిన భువీ.. చరిత్ర సృస్టించాడు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో ఆర్‌సిబి స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఫామ్‌లో చెలరేగిపోతున్నాడు. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి ఓడినప్పటికీ.. భువీ మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) రేసులో ఎస్ఆర్‌హెచ్ బౌలర్ ఇషాన్ మలింగా(15 వికెట్లు)ను వెనక్కి నెట్టి భువనేశ్వర్ (17 వికెట్లు) అగ్రస్థానానికి చేరాడు. అంతేకాక.. భువీ ఈ మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై 200 ఐపిఎల్ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా భువీ రికార్డు సాధించాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ను ఔట్ చేయడంతో భువనేశ్వర్ ఈ ఘనతను అందుకున్నాడు. భువీ తర్వాతి స్థానంలో చాహల్ (186 వికెట్లు) ఉన్నాడు. పలు ఐపిఎల్ సీజన్లు యుఎఇ, దక్షిణాఫ్రికా వేదికలుగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఓవరాల్‌గా ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్(228 వికెట్లు) మొదటిస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో భువనేశ్వర్ 215 వికెట్లతో ఉన్నాడు.

గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మసాలా దోశ: అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు!
పాత
Advertisement