24687 వార్తలు

యానాం: చట్టం అందరికీ సమానమే. ఎవరికి చుట్టం కాదు అనే ఈ వార్త ద్వారా తెలుస్తుంది. పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ వయ్యాపురి మణికందన శనివారం తన బైక్‌పై అసెంబ్లీకి వెళ్లారు. హెల్మెట్ లేకపోవడంతో నంబరు ప్లేటు లేని బైక్‌ను డ్రైవ్ చేసుకుంటూ అసెంబ్లీకి వెళ్లడంతో పోలీసులు సదరు ఎంఎల్‌ఎకు రూ.1500 జరిమానా విధించారు. సిఎం కార్యాలయం అధికారులు ఎంఎల్‌ఎలకు మూడు నెలల క్రితం కార్లు ఇచ్చారు కానీ డ్రైవర్లను ఏర్పాటు చేయకపోవడంతో తాను బైక్‌పై అసెంబ్లీకి వచ్చానని మణికందన్ తన బాధను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని నెటిజన్లు ప్రశంసించారు.

అమరావతి: బర్త్ డే వేడుకలకు రమ్మని పిలిచి ఓ మహిళను ఇద్దరు అన్నదమ్ములు హత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో జరిగింది. పోలసీఉలు తెలిపిన వివరాల ప్రకారం..... రాజమహేంద్రవరంలో అరుణ అనే మహిళకు(పేరు మార్చబడంది) భర్తతో విభేదాలు రావడంతో అతడి దూరంగా ఉంటుంది. మట్టాడి దేవి ప్రసాద్ పరిచయం కావడంతో అతడితో సహజీవనం చేస్తోంది. తన తమ్ముడి అరుణతో కలిసి ఉండడం అతడి సోదరుడు ప్రసాద్‌కు ఇష్టం లేదు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగతున్నాయి. దీంతో అరుణను చంపేయాలని అన్నదమ్ములు నిర్ణయం తీసుకున్నారు. గత మంగళవారం అయ్యప్ప పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని అరుణను రమ్మని దేవి ప్రసాద్ కబురు పంపాడు. దీంతో అరుణ ఇంటికి చేరుకున్న తరువాత ఆమె ఫోన్‌లో వీడియోలు చేస్తుండగా ఆమెను వెనక నుంచి ఒకరు చేతులు పట్టుకోగా అయ్యప్ప ఆమె తలపై సుత్తెతో పలుమార్లు కొట్టడంతో ఆమె స్పృహతప్పిపడిపోయింది. చనిపోయిందని అనుకునే ఆమెను స్థానికంగా డంపింగ్ యార్డులో పడేశారు. తెల్లవారుజామున కోన ఊపిరి కొట్టుమిట్టాడుతున్న ఉన్న ఆమెను పారిశుద్ధ్య కార్మికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరు





నవతెలంగాణ – హైదరాబాద్ : అసోంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గువాహటి–సోనాపూర్ జాతీయ రహదారిపై నలగేడెర వద్ద ప్రయాణికులతో ఉన్న మినీ ట్రావెలర్ బస్సు, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెలర్ బస్సు డ్రైవర్ సహా ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. నాగావ్ నుంచి గువాహటికి వెళ్తుండగా వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు […] The post అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సహా ఆరుగురు మృతి appeared first on Navatelangana.


మంత్రివర్గం నుంచి కొండా ఔట్? అసెంబ్లీ సమావేశాలకు ముందే నిర్ణయం 3న తేల్చనున్న అధిష్ఠానం ఢిల్లీకి రావాలని ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, పిసిసి చీఫ్‌కు పిలుపు ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక సమీకరణాలపై రేవంత్ కసరత్తు మంత్రులుగా పరిశీలనలో ఆది శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి, బాలూనాయక్, రాజగోపాల్ రెడ్డి, గడ్డం ప్రసాద్ పేర్లు సభాపతిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు పరిశీలన ఒప్పించే పనిలో సిఎంమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏండ్లు (సగం కాలపరిమితి) పూర్తికావడంతో ఇక మంత్రివర్గంలో ఉన్న ఖాళీల భర్తీపై అధిష్టానం దృష్టిసారించిం ది. దసరా నాటికి మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందు భావించినప్పటికీ మంత్రి కొండా సు రేఖ వివాదంతో అంతకుముందే చేపట్టక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ అంశంపై చర్చించడానికి సెప్టెంబర్ 3న ఢిల్లీకి రావాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కు ఏఐసీసీ సంస్థాగత జాతీయ ప్ర


నవతెలంగాణ – హైదరాబాద్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. మృతులను […] The post ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : న్యూజిలాండ్ సమీపంలోని కెర్మెడెక్ దీవుల వద్ద ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైనట్లు భూభౌతిక శాస్త్రవేత్తలు తెలిపారు. యూఎస్‌జీఎస్ ప్రకారం భూకంప కేంద్రం సముద్ర ఉపరితలం నుంచి 35–40 కిలోమీటర్ల లోతులో ఉంది. రాత్రివేళ ప్రకంపనలు రావడంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. The post భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదు appeared first on Navatelangana.


ప్రతి ఏటా 5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం గనుల తవ్వకం, రక్షణ, వ్యవసాయ, ఔషధ, డిజిటల్ రంగాల్లో విస్తృత సహకారం భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య కీలక ఒప్పందాలు ద్వైపాక్షిక బంధం బలోపేతానికి నిర్ణయం ప్రధాని మోడీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం ప్రదానం కిర్గిజిస్తాన్ చేరుకున్న ప్రధాని నేడు, రేపు ఎస్‌సిఓ శిఖరాగ్ర సదస్సుతాష్కెంట్: భారత్ ఉజ్బెకిస్థాన్ తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని ఆదివారం నిర్ణయించాయి. అలాగే 2030 నాటికి ఏటా 5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని ని ర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ మ ధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయాలు వె లువడ్డాయి. పౌర అణు ఇంధన రంగంలో సహకారానికి అనుగుణంగా.. ఉజ్బెకిస్థాన్ నుంచి భా రత్‌కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసే లా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. మోదీమిర్జియోయెవ్ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాలు, గనుల తవ్వకం, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, సమాచార సాంక

తెలంగాణలో భారీ వర్షాలు: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు (సోమవారం) మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురవొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌లో సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందంది. The post తెలంగాణలో నేడు భారీ వర్షాలు appeared first on Navatelangana.




భారత్‌లో వాళ్లు ఉండొద్దు అనుకునే వాళ్లు హిందువే కాదు దేశం అన్ని మతాలు, వర్గాలకు చెందింది సేవా కార్యక్రమాల్లో మేం ఎవరిపట్లా వివక్ష చూపం న్యూయార్క్ మాడిసన్ స్కేర్ ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలున్యూయార్క్: భారత్‌లో ముస్లింలు ఉండకూడదని భావించే వాళ్లు హిందువులే కాదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. వాళ్లు లేకుండా హిందూ రాజ్యమే లేదు అని అన్నా రు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్వేర్ గార్డెన్‌లో శనివారం జరిగిన ‘వన్ వరల్డ్: వన్ హ్యుమానిటీ ఫెయిత్ లీడర్స్ సమ్మిట్’ లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో అన్ని మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు కలిసి జీవిస్తున్నారని భగవత్ పేర్కొన్నారు. సంప్రదాయబద్ధంగా భారత్ అందరికీ ఆశ్రయం కల్పించిందని చెప్పారు. ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశం దొరకని వారు భారత్‌కు వచ్చి ఇక్కడ తమకంటూ స్థానం ఏర్పరచుకున్నారని వివరించారు. ప్రపంచ మానవాళి అంతా ఒక్కటేనన్న జ్ఞానం తమకు ఉందని, వైవిధ్యాలు ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటేననే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్పడం బాధ్యతగా భావిస్తున్నాం అన్నారు. ‘మీరు హిందూ సంస్థ. హిందూ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. మ


రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొలువుదీరి రేపటికి వెయ్యి రోజులు కొత్త బాటలో సంక్షేమం, సామాజిక న్యాయం పెట్టుబడులు, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు వైద్య రంగంలో విస్తరణ హైదరాబాద్ కేంద్రంగా భారీ అభివృద్ధి ప్రణాళికలు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్షం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనమన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సా రథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్1వ తేదీ నాటికి విజయవంతంగా వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్నిర్మించడం, సం క్షేమాన్ని విస్తరించడం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇ వ్వడం, రైతులు-,మహిళలు, -యువతకు భరోసా కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ప్రపంచస్థాయి మౌలిక వసతుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కాలంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలతో తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.4.18 లక్షల తలసరి ఆదాయం 2025- 26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని ప్రభుత్వం పేర్కొంది. దేశ

ఇంటికి రాలేక.. శిబిరాల్లో ఉండలేక నేపాలీల యాతన తాత్కాలిక శిబిరాల్లో సౌకర్యాల లేమి మళ్లీ వరద హెచ్చరికలతో నిత్యావసరాలతో ఎత్తైన ప్రాంతాలకు తరలుతున్న ప్రజలు 788కి చేరిన మృతుల సంఖ్య గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు డిఎన్‌ఏ నమూనాలు సేకరించి సామూహిక ఖననాలు ఇప్పటికీ జాడలేని 300 మందికిపైగా భారతీయులు జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న 500 మంది కార్మికులు రక్షించేందుకు నిపుణుల సాయంతో చర్యలు 3 రోజుల తరువాత శిథిలాల్లోంచి బయటపడ్డ ఆరేళ్ల బాలికఖాట్మండూ: నేపాల్‌లో ఆకస్మిక వరదల ప్రభా వం ఇంకా కొనసాగుతోంది. ఈ విపత్తులో మృతుల సంఖ్య ఆదివారంనాడు 788కి చేరిం ది. మరో 2,502 మంది గల్లంతయ్యారు. వీరి లో 320 మంది విదేశీయులు ఉన్నారు. భోటెకోషి నదిలో నీటిమట్టం మరోసారి పెరిగినట్లు నేపాల్ విపత్తుల విభాగం హెచ్చరించింది. ‘వరద ప్రభావిత భోటెకోషి నదిలో నీటిమట్టం కొంత మేర పెరిగింది. సంబంధిత అధికారు లు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లి‘ అని పేర్కొంది. మరింత సమాచారం అంది న తర్వాత పరిస్థితిపై తాజా వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. మరోవైపు నేపాల్ వరదల నేపథ్యంలో 275 మందికిపైగా భారతీయులు, భారత సంతతికి చెందిన

రూ.500 కోట్ల భూమిని రూ.87కోట్లకే కట్టబెట్టే కుట్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ అదే మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం కారుచౌకగా అప్పగిస్తారా? మీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయింది సిఎం రేవంత్‌కు బిఆర్‌ఎస్ నేత హరీశ్ బహిరంగ లేఖమన తెలంగాణ/హైదరాబాద్: నగరం నడిబొడ్డు న మరో భారీ భూ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కా ర్ తెరలేపిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్, అజామాబాద్‌లో తె లంగాణ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన రూ.500 కోట్ల వి లువైన ప్రభుత్వ భూములను రేవంత్ సర్కార్ కేవలం రూ.87 కోట్లకే ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే భారీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ మేర కు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే తాము పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. దశాబ్దాలుగా ప్రభ