
4165 వార్తలు
నవతెలంగాణ- హైదరాబాద్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. టెర్మినల్ లోపల, ప్రయాణికుల లగేజీలో బాంబులు అమర్చినట్లు వచ్చిన ఈ-మెయిల్‌తో CISF, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో విమానాశ్రయం అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీని పూర్తిగా పరిశీలిస్తూ భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం. The post రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు appeared first on Navatelangana.

నేను నా సాహితీ యాత్ర : (14) స్త్రీల పట్ల పురుషుల దృక్పథంలో మార్పుకై రచనలు1948 అక్టోబర్ 24న నేను జగ్గంపేట అనే గ్రామంలో పుట్టాను. అప్పటికది తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం తాలూకాలో ఉండేది. అదే ప్రాంతంలో మరికొన్ని జగ్గంపేటలు ఉండడం వల్ల - రామానుజులు ప్రతిష్ఠించిన వైష్ణవాలయం ఉన్న చిన్న గ్రామం తాళ్లూరును కలిపి తాళ్లూరి జగ్గంపేట అనేవారు. నా తల్లిదండ్రులు శ్రీమతి బంగారమ్మ, శ్రీ పల్లా వెంకటరమణ. మా ఊరి హైస్కూల్లో పదవతరగతి చదువుతూండగానే అప్పటి పద్ధతుల ప్రకారం నాకు కె. రామమోహనరావు గారితో వివాహం జరిపించారు మా పెద్దవాళ్లు. మరో ఏడాది చదువుకుని S.S.L.C (11వ తరగతి) పాసయ్యాను. మరో పదేళ్ల తర్వాత మళ్లీ ఇంటర్మీడియేట్ నుంచి ప్రారంభించి M.A. చేసాను. మావారి ఉద్యోగరీత్యా అప్పటికి మేమున్న జగ్గంపేటలోనే ఓ చిన్న ప్రైవేటు స్కూలు నడుపుతూ దాన్లోనే టీచర్ గా పనిచేసాను. మొదట్లో చాలానే కవితలు రాసినా ప్రచురణా 8వ తరగతి చదువుతు న్నప్పు డు ఆంధ్రపత్రిక వీక్లీలో వచ్చిన ‘కాఫీ కాదు’ అనే చిన్న కథ - పెద్దయ్యాక చాన్నాళ్లకి జ్యోతి మంత్లీలో వచ్చిన ‘రిక్షా’ అనే కథ నా మొదటి కథలు. మా ఇంట్లో ఎలాంటి సాహిత్య వాతావరణం ఉండేదికాదు. బహుశా
నవతెలంగాణ – హైదరాబాద్ : తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీవకోన సమీపంలో ప్రారంభమైన మంటలు మొండోడికోన నుంచి తిమ్మినాయుడుకోన వరకు వ్యాపించి సుమారు 2 కిలోమీటర్ల మేర అడవి దగ్ధమైంది. ఈ ఘటనలో విలువైన వృక్షాలు, వనమూలికలు నాశనమయ్యాయి. వన్యప్రాణులు భయంతో పరుగులు తీశాయి. అటవీ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలిసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. The post తిరుమల శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు చేయాలని, లేదంటే మే 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు అల్టిమేటం ఇచ్చారు. ప్రస్తుతం రెంటల్ విధానంతో నష్టపోతున్నామని, మల్టీప్లెక్సుల్లో అమలు చేస్తున్నట్లే తమకూ పర్సంటేజీ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 30 లోగా నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్ ధరల నియంత్రణ, పన్నులు, విద్యుత్ చార్జీలపై సడలింపు ఇవ్వాలని […] The post మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత appeared first on Navatelangana.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో పెనుమాకలో టిడిపి నాయకుడు కత్తితో హల్ చల్ చేశాడు. ఉండవల్లి తెలుగుదేశం పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు ప్రదీప్ రాత్రి కత్తి తీసుకుని నరుకుతా అంటూ హల్ చల్ చేయడంతో గ్రామస్థులు భయంతో వణికిపోయారు. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికి వాళ్లు పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. తమకు ఇప్పటివరకు ఎవరు సమాచారం ఇవ్వలేదని తాడేపల్లి పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసిపి కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. అబ్దుల్ అలియాస్ బండాను దుండగులు నరికి చంపారు. తాడిపత్రి పట్టణంలోని ఏటిగడ్డపాళ్యంలో పట్టపగలు నడిరోడ్డుపై అబ్దుల్ నరికి చంపారు. అబ్దుల్ ఇంటికి వెళ్తుండగా మాటువేసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి పాలనలో వైసిపి కార్యకర్తలు ప్రాణ భయంతో వణికిపోతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైసిపి కార్యకర్తలు ప్రాణ భయంతో గ్రామాల్లోకి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎపిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా? భాస్కర్ రెడ్డి అనే నెటిజన్ కామెంట్లు చేశాడు.








హైదరాబాద్: నల్లగొండలో ఆర్ టిసి డ్రైవర్ పై దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. టిజి 05 యు 3219 ఆర్టీసీ బస్సు ను డ్రైవర్ టి.రామ్ కుమార్ నల్గొండ - దిల్ సుఖ్ నగర్ మధ్య నడిపిస్తున్నాడు. నల్గొండ నుండి వివిధ స్టాప్ ల వద్ద ఆగుతూ ప్రయాణికులను తీసుకొని వస్తున్న బస్సు వెనకాల బైక్ పై వస్తున్న వ్యక్తి తన భార్యను తీసుకొని వస్తు నల్గొండ ఐటి టవర్ వద్దకు రాగానే బస్సు ఎక్కించే ఉద్దేశ్యంతో బస్సును ఓవర్ టెక్ చేసి అడ్డగించాడు. అనంతరం డ్రైవర్ రామ్ కుమార్ పై దాడి చేశాడన్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసి సిబ్బంది పై దాడి చేస్తే ఉపేక్షించేది లేదని పొన్నం హెచ్చరించారు. డ్రైవర్ రామ్ కుమార్ పై దాడి చేసిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని తెలియజేశారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించడం జరిగిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని పొన్నం పేర్కొన్నారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు దగ్ధమైంది. మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రయివేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post ప్రయివేటు ట్రావెల్ బస్సు దగ్ధం appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్ విద్యార్థి గల్లంతైన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్నేహితులతో కలిసి నది ఒడ్డుకు వెళ్లిన యువకుడు, ప్రమాదవశాత్తు అలకనంద నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన పౌరీ గర్వాల్ జిల్లాలోని శ్రీనగర్‌లో నిన్న సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌కు చెందిన ఆనంద్ మోహన్ (21), శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న సాయంత్రం 4 గంటల […] The post అలకనంద నదిలో తెలంగాణ విద్యార్థి గల్లంతు appeared first on Navatelangana.


రెవెన్యూ, మండల స్థాయికి ప్రజల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థసత్వరమే రెవెన్యూ డివిజన్లలో అమలుఆ తరువాత మండల స్థాయి ప్రతి ఫిర్యాదుపై పరిష్కార పురోగతిని అర్జీదారుకు తెలపాలినమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధిప్రతి జిల్లాలోనూ ప్రజావాణికి నోడల్ ఆఫీసర్ల నియామకంఅధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత ప కడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని ఆయన సూ చించారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఎంసిహెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంఓ అధికారులను ఆదేశించారు. వెంట నే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని, తరువాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.ప్రజా వాణిలో వచ్చే ఫిర్య

వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి ఎవరెన్ని పన్నాగాలు పన్నినా.. మళ్లీ కెసిఆర్ సిఎం అవ్వడం ఖాయంగుర్తింపు కోసమే సిఎం రేవంత్ విమర్శలు యాక్టర్ల నుంచి యాంకర్ల వరకు ఆయనను గుర్తించడం లేదు: కెటిఆర్మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా కొంతమంది తమకు సరైన గు ర్తింపు రావడం లేదనే కెసిఆర్ పట్ల విమర్శలు చే స్తూ కాలం వెల్లబుచ్చుతున్నారని బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ముఖ్యమంత్రి అ యిన తర్వాత కూడా యాక్టర్ల నుంచి యాంకర్ల వ రకు ఎవరూ కూడా తనను గుర్తు పట్టలేదన్న ఉ క్రోషంతోనే రేవంత్ రెడ్డి ప్రతిరోజు మాజీ సిఎం కె సిఆర్ పైన అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నార ని మండిపడ్డారు. కెసిఆర్‌ను ఏదో నాలుగు మాట లు అని పైశాచికానందం పొందితే వార్తల్లో వస్తామన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘు, హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో కలిసి కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మా ట్లాడుతూ, మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి పే రున
నవతెలంగాణ – హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజరుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వీరిద్దరూ ఇవాళ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు. శాసనమండలి ఛైర్మన్ కార్యాలయం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోంది. The post నేడు ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: కేసీఆర్ అధ్యక్షతన నేడు(సోమవారం) హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ విస్తరణపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండాలు ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎండల దృష్ట్యా ఈసారి కార్యక్రమాలను పరిమితంగా నిర్వహించాలని సూచించారు. The post నేడు బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం appeared first on Navatelangana.