
మన తెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్‌కు, నాకు పోలికనా..? నందికి, పందికి ఉన్నం త తేడా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా కెసిఆర్ పూర్తిగా వి ఫలమయ్యారని ఆరోపించారు. 1,000 రో జుల ప్రభుత్వ సొమ్ము మెక్కి గంట కూడా పనిచేయని కెసిఆర్ వెంటనే రాజీనామా చే యాలని అన్ని చోట్ల నిరసనలు తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆరు రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలన్న డి మాండ్‌తో నిరసనలు తెలపాలని సిఎం రే వంత్‌రెడ్డి సూచించారు. ఈనెల 06వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, 7వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో హోదాలో కెసిఆర్ భద్రత,
వసతుల కోసం 21 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని సిఎం తెలిపారు. పదేళ్లలో కెసిఆర్ ఏం చేశారో, 1,000 రోజుల్లో తాను ఏం చేశానో అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సిఎం సవాల్ విసిరారు. ఏనాడూ పదవిని దుర్వినియోగం చేయలేదని, చేయననీ, తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ తాను ఒక్కడినేనని చెప్పి అధికారంలోకి రాగానే ఆ తర్వాత మొత్తం తన కుటుంబాన్ని దించి గుంపు మందలా జమై మంది సొమ్ము తిన్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు 1,000 రోజులు బయటకు రాకుండా ఉన్నారా..? అని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం చెందిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన ఆరోపించారు.
బలహీన వర్గాల బిడ్డ మహేష్‌కుమార్ గౌడ్‌ను పిసిసి అధ్యక్షుడిగా చేశా
మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నాకు, కెసిఆర్‌కు పోలికలేదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కెసిఆర్ ముఖ్యమంత్రి కాగానే ఆయన కొడుకు, అల్లుడిని మంత్రిని చేశారని సిఎం ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి కాగానే పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని మంత్రులు చేశాననన్నారు. తాను సిఎం అయితే వి. హనుమంతరావును ప్రభుత్వ సలహాదారుడిగా చేశానని, అనిల్ యాదవ్‌ను ఎంపి చేశానని, ఎర్రబెల్లి దయాకర్‌ను మంత్రిని చేశానని, అడ్లూరి లక్ష్మణ్‌ను మంత్రి చేశానని ఆయన తెలిపారు. అప్పట్లో కెసిఆర్ వెంకట్ రామిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తే, తాను అద్దంకి దయాకర్‌ను ఎమ్మెల్సీ చేశానని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ తన కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే, తాను బలహీన వర్గాల బిడ్డ మహేష్‌కుమార్ గౌడ్‌ను పిసిసి అధ్యక్షుడిగా చేశానని ఆయన తెలిపారు. 1,000 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
1931లో బ్రిటిష్ వాళ్లు కులగణన చేస్తే, మళ్లీ 100 ఏళ్ల తర్వాత తెలంగాణలో బిసి కులగణన చేసి మోడీకి సవాల్ విసిరామని ఆయన పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల కోసం పాలసీ తెచ్చామని, స్పోర్ట్, ఐటీ, టూరిజం, ఎండోమెంట్ పాలసీ తీసుకువచ్చామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 1000 రోజుల్లో పేదలు, ఆడబిడ్డలు, విద్యార్థులు, రైతులు, దళితులు, ఆదివాసీల కోసం ఒక్క రోజైనా పనిచేశావా..? అని కెసిఆర్‌ను సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మనమడు ఆస్పత్రికి వెళితే, బంధువులు ఎవరైనా చనిపోతే తప్ప బయటకు రాలేదని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 1,000 రోజుల్లో తాను ఒక్క గంటైనా సెలవు తీసుకోలేదని, 1,000 రోజుల్లో ఒక్కరోజైనా పనిచేశావా అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం పెట్టి కార్యకర్తల రక్తాన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముకున్న దుర్మార్గులని బిఆర్‌ఎస్ నాయకులను ఉద్ధేశించిన సిఎం ఆరోపించారు.
ఉద్యోగ సంఘాల సమస్యలను అర్థం చేసుకుంటా
ఉద్యోగ సంఘాల సమస్యలను తాను అర్థం చేసుకుంటానని, 32 నెలల్లో ఎప్పుడైనా 1వ తేదీన జీతాలు ఇవ్వకుండా ఆపామా..? ఉద్యోగులు ఆలోచించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తుఫాన్ వచ్చినా, కరువు వచ్చినా ఒకటో తేదీనే జీతాలు వేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆనాడు ఎలా ఉంది, ఈనాడు ఎలా ఉందో ఉద్యోగులు ఆలోచించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఐదున్నర లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐదో తేదీనే జీతాలు ఇస్తున్నామని, గతంలో ఆరు నెలలకొకసారి జీతాలు ఇచ్చేవారని, కానీ, ఐదో తేదీనే జీతాలు ఇస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 61 ఏళ్లకు ఉద్యోగ వయోపరిమితి పెంచడంతో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అన్నీ తమ ప్రభుత్వంపైనే పడ్డాయని, రూ.8 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు కెసిఆర్ తమ నెత్తిన పెట్టిపోయారని ఆయన పేర్కొన్నారు. రెండు నెలల్లో రూ.6 వేల కోట్ల రిటైర్‌మెంట్ బకాయిలను విడుదల చేశామని ఉద్యోగులు, వాళ్ల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కార్డులను పునరుద్ధరించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
కెసిఆర్ హయాంలో 60 మంది ఆర్టీసి కార్మికులు చనిపోతే
కెసిఆర్ హయాంలో ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తే 60 మంది చనిపోతే కనీసం కన్నీరు కార్చలేదని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసి కార్మిక గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు బయటకు రాలేదని ఆయన పేర్కొన్నారు. అగ్గిపెట్టేరావుకు ఆనాడు పది పైసల అగ్గిపెట్టే దొరకలేదన్నారు. 2023 డిసెంబర్ 7వ తేదీన సిఎంగా ప్రమాణ స్వీకారం చేసి సచివాలయం వెళ్లి సమీక్ష చేస్తే 11 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని అధికారులు చెప్పారన్నారు. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసిందని అధికారులు పేర్కొన్నారన్నారు. రూ.16 వేల కోట్ల మిగులుతో కాంగ్రెస్ పార్టీ కెసిఆర్‌కు తెలంగాణను అప్పగించిందని, ఏడాదికి రూ.6,500 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తే సరిపోయేదని సిఎం తెలిపారు. తొమ్మిదిన్నర ఏళ్లలో ఒకే ఒక కుటుంబం 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల్లో తెలంగాణను నిండా ముంచిందని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు, పింఛన్లు ఇవ్వలేని స్థితికి తీసుకువచ్చిందని సిఎం వాపోయారు. 60 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు 70 వేల కోట్ల అప్పు చేస్తే కెసిఆర్ ఒక్కరే తొమ్మిదిన్నర ఏళ్లలో ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేశారని, నెలకు రూ.7,500 కోట్ల అసలు, మిత్తీ చెల్లించాల్సి వస్తోందని, ఏడాదికి 85 వేల కోట్ల అసలు, మిత్తీ చెల్లించాల్సిన పరిస్థితుల్లోకి నెట్టారని బిఆర్‌ఎస్ నాయకులపై సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్‌పేటలో పదెకరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని సిఎం తెలిపారు.
బతుకమ్మ కుంటను చెరపట్టింది ఎవరు?
బతుకమ్మ కుంటను చెరపట్టింది ఎవరు..? ఏ నాయకుడు వస్తే హెలికాప్టర్లో పూలు చల్లి బతుకమ్మ కుంటను చెరపట్టారో అందరికీ తెలుసనీ సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరించామని, ఎండాకాలంలో కూడా నీళ్లు ఊరాయని, బతుకమ్మ కుంటకు వచ్చి విమలక్క పాటలు పాడితే, ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే ఆయన బతుకమ్మ కుంటను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయనకు ఎవరు మద్దతు ఇస్తున్నారో ఆలోచించాలన్నారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మీకే అప్పగించామని, హైడ్రాను తెచ్చానని తనపై ఆరోపణలు చేసి నిందిస్తున్నారని సిఎం పేర్కొన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 1,000 రోజులు పూర్తి చేసుకున్నామని, ప్రజా పాలన వచ్చి ఇప్పటికి 1,000 రోజులయ్యిందని,
1,000 రోజుల ప్రజా పాలనపై తాము కార్యాచరణ తీసుకున్నామని. నిరసన తెలుపుతామని కొందరు బయలుదేరారని, పదేళ్లు తెలంగాణను నడిపించిన వాళ్లు, కబళించిన వాళ్లు ఇప్పుడు నిరసనలు తెలుపుతామంటున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ స్కూళ్లలో లక్ష అడ్మిషన్లు పెరిగాయని, 28వ స్థానంలో ఉన్న తెలంగాణను 18వ స్థానానికి తీసుకువచ్చామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు చేపట్టలేదని, నోటిఫికేషన్లు ఇవ్వాలని, ప్రశ్నాపత్రాలు ముద్రించి లీక్ చేశారని, ఇదే గత ప్రభుత్వ విధానమని సిఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.
1,000 రోజుల పాలనలో 72 వేల ఉద్యోగాల భర్తీ చేశాం
1,000 రోజుల పాలనలో 72 వేల ఉద్యోగాల భర్తీ చేశామని, ఐటిఐలను ఏటిసిలుగా మారుస్తున్నామని, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశామని, రూ.1.70 లక్షల కోట్లను 1,000 రోజుల్లో రైతుల కోసం ఖర్చు చేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కెసిఆర్ వరి వేసుకుంటే ఉరే అన్నారని సిఎం ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రూ.20,617 కోట్ల రైతు రుణమాఫీ చేసిందని, రూ. 30 వేల కోట్లను ఉచిత రైతు విద్యుత్ కోసం ఖర్చు చేసిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో అప్పులు లేని రైతులు ఉన్నారని నీతి ఆయోగ్ చెప్పిందని సిఎం పేర్కొన్నారు.
సన్నబియ్యం తింటూ బిఆర్‌ఎస్ వాళ్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు
ఇందిరమ్మ ఇళ్లను ఆడబిడ్డల పేరుతో ఇస్తున్నామని, అడిగిన వారికి రేషన్ కార్డులు ఇస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందిలో బిఆర్‌ఎస్ వాళ్లు కూడా ఉన్నారని సన్నబియ్యం తింటూ వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పేదల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నాం ప్రజా పాలన అంటే ఇది కదా అని సిఎం పేర్కొన్నారు.
త్వరలోనే ఎల్బీ నగర్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభించుకుంటాం
త్వరలోనే ఎల్బీ నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు. అల్వాల్ టిమ్స్ ఆస్పత్రికి మాజీ సిఎం అంజయ్య పేరు పెడతామని, ఎల్బీ నగర్ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్ పేరు పెడతామని, వరంగల్ ఆస్పత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహం తీస్తామంటూ బిఆర్‌ఎస్ నాయకులు పేర్కొంటున్నారని ఒకసారి ఆ విగ్రహాన్ని ముట్టుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదని ఆయన ఆరోపించారు. సెక్రటేరియట్ ఎదుట మేము విగ్రహాన్ని పెట్టామని ఆయన తెలిపారు. మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని నెక్లెస్ రోడ్డులో పెట్టామని,
ఇది మా పరిపాలన వైఫల్యమా..? శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను అనాథలా రోడ్డుమీద పడేస్తే మహిళా కమిషన్ సభ్యురాలిగా చేశామని, వీరనారి చాకలి ఐలమ్మ పేరు మహిళా యూనివర్సి టీకి పెట్టామని, చాకలి ఐలమ్మ మనవరాలిని మహిళా కమిషన్ సభ్యురాలిని చేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపిలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపి మధు యాష్కీ తదితరులు పాల్గొన్నారు.











