తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఆదివారం శ్రీవారిని 98,058 మంది భక్తులు దర్శించుకున్నారు. 49,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.09 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు తెలిపారు. 4.2 లక్షల లడ్డు ప్రసాదాలను విక్రయించినట్టు అధికారులు వెల్లడించారు.