యంగ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా ‘భగవంతుడు‘. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘భగవంతుడు‘ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ’శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్ చేశారు. శ్రామిక శక్తికి నమస్కరిస్తూ తెరకెక్కించిన ఈ పాటను హాయ్ కే.పి స్ఫూర్తికరంగా కంపోజ్ చేయగా, సింగర్ కుమార వాగ్దేవి పాటలోని భావోద్వేగాలను పలికిస్తూ పాడారు.