అమరావతి: వట్టి చెరుకూరులో ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇచ్చామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించామని అన్నారు. ఎకనామిక్ రిపోర్ట్ నివేదికల ఆధారంగా డేటా డ్రివెన్ గవర్నర్నెన్స్ పై శ్రీకారం చుట్టారు. వ్యవసాయం- అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగంపై సిఎం సమీక్షించారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ వొడిలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శెట్టిపల్లిలో 60-70 ఏళ్లుగా ఉన్న భూసమస్య పరిష్కరించామని, ప్రాపర్టీని అన్ లాక్ చేస్తే ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి వచ్చిందని తెలియజేశారు. సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, కొన్ని విభాగాల్లో స్థిరంగా, మరికొన్ని విభాగాల్లో అనూహ్య వృద్ధి అని అన్నారు. లక్ష్యాల మేరకు ముందుకెళ్తే 15 శాతం వృద్ధి రేటు సాధ్యమవుతుందని, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కోసం రెవెన్యూ రిసిప్ట్స్ చాలా ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ ఏడాదిలో జిఎస్ డిపి 20.4 శాతంగా నమోదైందని, కొందరు వ్యక్తులు కీలక విభాగాల్లో నెగెటివ్ రోల్ చేస్తే ఇబ్బంది వస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో కెపిఐ ఇండికేటర్ల ద్వారా నెలవారీ ఆర్థిక నివేదిక తయారీ చేస్తున్నామని, మంత్రులు, కార్యదర్శులు, హెచ్ వొడిల క్షేత్రపర్యటనలపై షెడ్యూల్ ఇచ్చామని అన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లాలంటే ఎవరికీ ఆసక్తి ఉండదని తనతో.. సహా క్షేత్రస్థాయికి వెళితే మాత్రం చాలా సంతృప్తి ఉంటుందని, క్షేత్రస్థాయిలోకి వెళ్తేనే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. పిజిఆర్ఎస్ లో జిరో పెండింగ్ లక్ష్యంగా టైమ్ బాండ్ ప్రోగ్రామ్ అని ఎలక్ట్రికల్ వాహనాలను మరింత ప్రోత్సహించాలని ఆదేశించారు. గ్రీన్ ఎనర్జీ రవాణా వాహనాలతో కాలుష్యరహితంగా మారుతుందని, ఎలనినో వల్ల 25 శాతం లోటు వర్షపాతం ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.