
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తమిళనాడులో నటుడు విజయ్ దళపతి పార్టీ టివికె ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ 104 సీట్లలో ఆధిక్యంలో ఉంది. సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్ టివికె విజయ్ ట్రెండింగ్‌లో ఉంది. తమిళనాడులో టివికె (104), డిఎంకె(58), అన్నాడిఎంకె(72) స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో అతడి పెద్ద పార్టీగా టివికె అవతరించింది. డిఎంకె కూటమి మూడో స్థానానికి పరిమితమైంది. ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌లు వెనుకంజలో ఉన్నారు. ట్విట్టర్‌లో యాస్ ట్యాగ్ లు ఎలక్షన్ రిజల్ట్, తలపతి, త్రిష, హిమంతాబుల్డోజడ్ కాంగ్రెస్, జన నయగన్ అనే ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.














