ఐపిఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై నిర్దేశించిన 244 పరుగల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసి చేధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(45), ట్రావిస్ హెడ్(76)లు మరోసారి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తర్వాత క్లాసెన్(65) అజేయ అర్ధశతకంతో చెలరేగాడు. చివర్లో సలీల్ అరోరా(30 నాటౌట్) భారీ షాట్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో మరో 8 బంతులు ఉండగానే హైదరాబాద్ సూపర్ విక్టర్ సాధించింది.