అమరావతి: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు టైర్ కింద పడి మహిళ మృతి చెందింది. వడ్లమూరు నుంచి కాకినాడ వెళ్లే బస్సులో మహిళ సామర్లకోటకు రాగా, రాజానగరం బస్సు ఎక్కేందుకు వెళ్తుండగా.. బస్సు దిగుతుండగా కిందపడిపోయింది. మహిళ మృతదేహాన్ని పెద్దాపురం ఆసుప్రతికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.