
మన తెలంగాణ/హైదరాబాద్: అధికారంలోకి వస్తే ఫ్యూచ ర్ సిటీని రద్దు చేస్తామని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మండిపడ్డా రు. అమెరికా వెళ్ళిన హరీశ్‌రావు అక్కడ పగటి కలలు కం టున్నారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ధ్వ జమెత్తారు. హరీశ్‌రావు ప్రకటన తెలంగాణ ప్రాంతానికి అ న్యాయం చేస్తున్నట్లు కనిపిస్తున్నదని ఆయన ఆందోళన వ్య క్తం చేశారు. ఇలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు రావ ని, పక్క రాష్ట్రాలకు వెళతాయని అన్నారు. పెట్టుబడులు అ డ్డుకోవడంతో రాష్ట్రంలోని యువతకు అన్యాయం చేసి ఉ ద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా? అని ఆయ న హరీశ్‌రావును ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీలో కాలుష్యకారక పరిశ్రమలు ఉండవని, వాటిని రద్దు చేస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధికి బిఆర్‌ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన తూర్పారపట్టారు. రాష్ట్రాభివృద్ధి జరగాలని మీకు ఉందా? మీ పార్టీ కి ఉందా?, అసలు రాష్ట్ర అభివృద్ధిపై మీ వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బిఆర్‌ఎస్ నేతలు బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన వి మర్శించారు. బిఆర్‌ఎస్ నేతలకు స్వార్ధ రాజకీయాలే ము ఖ్యమని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ నేతలకు రాష్ట్ర ప్రయోజనాలు అవస రం లేదని మంత్రి శ్రీధర్‌బాబు దుయ్యబట్టారు. మీ రాజకీయాల కోసం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలను పక్క రాష్ట్రాలకు పంపించేలా చేయడం సమంజసమా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలనే అజెండా పెట్టుకున్నారని ఆయన బిఆర్‌ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓటమి నిరాశ నుంచి ఇంకా తెరుకోలేక పోతున్నారని ఆయన అన్నారు. అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకా బుద్ది మారడం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహా నగరాల అభివృద్ధి స్వయంగా వెళ్లి పరిశీలించామని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నామని ఆయన వివరించారు. మెట్రో రైలుకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే చేపట్టడం జరిగిందే తప్ప బిఆర్‌ఎస్ హయంలో ఒక్క కిలో మీటర్ కూడా ముందుకు సాగలేదన్నారు. జంట నగరాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని మెట్రోను అభివృద్ధి చేస్తామంటే బిఆర్‌ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. '
చార్మినార్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ చేస్తామంటే వద్దంటున్నారని, బులెట్ రైలు తీసుకొస్తామంటే దానికీ అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. భారత్ ఫ్యూచర్ సిటీ కాలుష్య కర్మాగారాలు రావొద్దు అని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజలు కోరుకున్నట్లే జరుగుతుందన్నారు. యువత బంగారు భవిషత్యు కోసం ఫ్యూచర్ సిటీ అని ఆయన తెలిపారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సైబరాబాద్‌ను ఏర్పాటు చేసినందుకే ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా మారిందన్నారు. హై-టెక్ సిటీని తీసుకొచ్చిందీ గతంలో తమ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. భావితరాల కోసం భారత ఫ్యూచర్ సిటీని తమ ప్రభుత్వం తీసుకొస్తున్నదని ఆయన చెప్పారు. బిఆర్‌ఎస్ చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలు సహించరని ఆయన హెచ్చరించారు. అధికారం లేదని ఓర్వలేక రాక్షసుల్లగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. కాలుష్యం లేని పరిశ్రమలు, గ్రీన్ పార్మకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్ నాయకులు ఆలోచించుకోవాలని, ఇలాగే అడ్డుపడితే వచ్చే ఎన్నికల్లో అడ్రసు ఉండదని ఆయన హెచ్చరించారు.
బిజెపితో కలిసి అడ్డుపడుతున్న బిఆర్‌ఎస్
మూసి నది ప్రక్షాళన సమయంలో పేదవాడికి నష్టం జరిగితే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మూసి నది ప్రక్షాళన జంట నగరాల ప్రజలకు వరం అని ఆయన తెలిపారు. మూసి నది నీటిని పరిశుద్ధం చేయాల్సిన అవసరం ఉందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. మూసి నది అంటే మిత్రపక్షం అయిన బిజెపితో కలసి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కెబిఆర్ పార్క్ దగ్గర అండర్ గ్రౌండ్ రోడ్లను ఏర్పాటు చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల నుండి మైగ్రేషన్ దృష్టిలో పెట్టుకొని త్రాగు నీరు,
రోడ్లు, రవాణా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న మీపై ఆ బాధ్యత లేదు కాబట్టి విమర్శలు చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా రాష్ట్రంలోని యువతకు అన్యాయం చేయవద్దని ఆయన బిఆర్‌ఎస్ నేతలను కోరారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు యువతకు అన్యాయం చేశారని, ప్రతిపక్షంలో ఉండి కూడా అన్యాయం చేస్తారా ? అని ఆయన మండిపడ్డారు. ఏవైనా ఆరోపణలు చేసే ముందు వెనుకాముందు ఆలోచన చేయాలని, మీ వద్ద సాక్షాధారాలు ఉంటే బయట పెట్టాలని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేస్తారా? హరీష్ రావు చెప్పాలి? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.













