మన తెలంగాణ/ హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఇటీవల అస్వస్థకు గురైన పవన్‌కల్యాణ్‌కు అపోలో ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి, వైద్యులు అందిస్తున్న చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని బాబు ఆకాంక్షించారు. రాజకీయాలకు విరామం ఇచ్చి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా సూచించారు.