లండన్: మహిళల టి20 ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో హర్మన్ సేన ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 19 ఓవర్లోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.