హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పరిధిలోని కూత్బుల్లాపూర్‌లో ప్రియుడు ఫోన్ రిఛార్జ్ చేయలేదని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... ప్రశాంత్ నగర్‌కు చెందిన కిరణ్మయి అనే యువతి ఓ యువకుడిని 2015లో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు కుమారుడు పుట్టిన తరువాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. కూకట్‌పల్లిలో సదరు యువతి బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. వెంకటేశ్ అనే యువకుడు పరిచయం కావడంతో ప్రేమ మారింది. ఇద్దరు కలిసి ప్రశాంత్ నగర్‌లో సహజీవనం సాగిస్తున్నారు. కిరణ్మయి ఫోన్ రీఛార్జ్ అయిపోవడంతో వెంకటేశ్‌ను రీఛార్జ్ చేయమని కోరింది. వెంకటేశ్ కూత తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరణ్మయి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.