ఉప్పల్: ప్రధాని నరేంద్ర మోడీ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు మారినేని ఫణీంద్ర తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఉప్పల్ డివిజన్ పరిధిలోని న్యూ శాంతినగర్ కాలనీలో దేశ ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ పాలన విజయవంతంగా 4399 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫణీంద్ర మీడియాతో మాట్లాడారు. అలాగే ఉప్పల్ డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని వివరించారు.

ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు మారినేని ఫణీంద్ర,  ఉప్పల్ డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు భాజ జయరాం  ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి నివాళులర్పించి, ప్రధాని నరేంద్ర మోదీ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సురేఖ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మోదీ గారి సుపరిపాలన గురించి బస్తీ వాసులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బల్వంత్ చారి, డివిజన్ ప్రధాన కార్యదర్శి తీగ విట్టల్ రావు ముదిరాజ్, ఉపాధ్యక్షులు అంజి రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీధర్ గుప్తా, మహిళా మోర్చా అధ్యక్షురాలు మద్దెల పద్మ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు అమరేందర్, యువ మోర్చా అధ్యక్షులు ఆడెపు రమేష్, గిరిజన మోర్చా అధ్యక్షులు రాజు నాయక్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ల జాన్, సోషల్ మీడియా కన్వీనర్ అభిరామ్, దళిత మోర్చా నాయకులు శివకుమార్, వినోద్, సిలివేరు సుదర్శన్, సతీష్, రామ్ నివాస్, రవితేజ, జస్ట్ బీర్ శేఖర్, యువ మోర్చా అధికార ప్రతినిధి వెంకట్ సాయి ముదిరాజ్, రాజేందర్, మహిళా మోర్చా నాయకురాళ్లు నవత, జ్యోతి, శారద, కోమలత, విజేత, పూజ, మాధవి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.