హైదరాబాద్: మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీ కోసం జట్లు అన్నీ వార్మప్ మ్యాచ్‌లు ఆడాయి. టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో గెలిచి రెండోదాంట్లో ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్‌పై స్వల్పతేడాతో ఓడిపోయింది. ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుండడంతో ఇరు దేశాల అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించారు. కీలక సమయంలో భాగస్వామ్యం నెలకొల్పకపోవడంతో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయామన్నారు. రిఛా ఘోష్ అద్భుతంగా ఆడడంతో విజయానికి చాలా దగ్గరగా వచ్చామని తెలిపారు. వార్మప్ మ్యాచ్‌లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చామని, ప్రపంచ కప్ తొలి మ్యాచ్ సరికి ఇక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకోవాలన్నారు. మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ ను ఢీకొంటున్నామని, ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నాని హర్మన్ పేర్కొన్నారు. టి20 మ్యాచ్‌లలో భయంలేకుండా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. మహిళ భారత జట్టు ఇప్పటివరకు వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోలేదని, గత వరల్డ్ కప్‌లోఏ తాము ఫైనల్ చేరినప్పటికి కప్ సాధించలేదన్నారు. 2025లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్ లో మహిళల భారత జట్టు ఘన విజయం సాధించి కప్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచిన విషయం విధితమే.