తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్వహించిన పాలిసెట్-2026 పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను 293 కేంద్రాల్లో నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరిగింది.
మొత్తం లక్షా 6 వేల 439 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా… 98 వేల 28 మంది పరీక్షకు హాజరయ్యారు. దీంతో మొత్తం హాజరు శాతం 92.10గా నమోదైంది. బాలుర హాజరు 92.40 శాతం కాగా… బాలికల హాజరు 91.75 శాతంగా ఉంది. సాంకేతిక విద్యాసంస్థలతో పాటు వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.














