
రావల్‌కోట్: మరోసారి పాకిస్థాన్ ఆర్మీ బరితెగించింది. పివొకె రావల్‌కోట్‌లో నిరసనకారులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందగా.. మరో 37 మంది గాయపడ్డారు. రెండు రోజుల కిందట విఒకెలో ఘర్షణలు చెలరేగగా.. అప్పుడు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మృతి చెందారు. పాక్ నుంచి విముక్తి కల్పించాలని నిరసనకారులు ఆందోళనలు చేస్తుండగా.. వారిపై పాక్ ఆర్మీ కాల్పులతో విరుచుకుపడుతోంది. దీంతో గత మూడు రోజులుగా పివొకెలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
పివొకెలో ఇటీవల ముజఫరాబాద్, రావల్‌కోట్, మీర్‌పూర్, ప్రాంతాల్లో నిరసనలు ఉధృతమయ్యాయి. పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, విద్యుత్ బిల్లుల భారం, పాలనాపరమైన సమస్యలపై ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. కొన్ని చోట్ల నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోగా, కాల్పులు కూడా జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి.












