మన తెలంగాణ/నాంపల్లి: నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం, గాంధీభవన్ వద్ద కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నిరసనలతో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. తొలుత యువజన కాంగ్రెస్ శ్రే ణులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించి గేట్‌పై నల్లరంగు చ ల్లారు. దీనికి ప్రతిగా బీజేపీ యువమో ర్చా నేతలు గాంధీభవన్ వద్ద నిరసనకు దిగడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బీజేపీ కార్యాలయానికి చేరుకొని అమిత్‌షా దిష్టిబొమ్మ ను దహనం చేశారు.

విద్యార్థులపై కాల్పు ల ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అ మిత్ షా రాజీనామా చేయాలని డిమాం డ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందు కు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులా ట జరిగింది. శివచరణ్‌రెడ్డితోపాటు పలువురు యువజన కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, యువజన కాంగ్రెస్ తరువాయి 9లో